నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపై స్పందించిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో తాజాగా జరిగిన సౌత్ ఆఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకు( South Africa ) ఊహించని గట్టి షాక్ తగిలింది.పసికూన నెదర్లాండ్స్( Netherlands ) చేతిలో సౌత్ ఆఫ్రికా ఘోరంగా ఓడిన చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.

 South Africa Captain Bavuma Reacts After Lost To Netherlands Details, South Afri-TeluguStop.com

ప్రపంచ కప్ లో పసికూన జట్లు, పెద్ద జట్లకు ఊహించని షాక్లు ఇస్తున్నాయి.అక్టోబర్ 15న ఇంగ్లాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాక్ ఇచ్చింది.

అక్టోబర్ 17న సౌత్ ఆఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది.

అక్టోబర్ 17న జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

వర్షం అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు.మ్యాచ్ ఆరంభంలో సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ 82 పరుగులకే ఏకంగా ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగుతుందని సౌత్ ఆఫ్రికా భావించింది.కానీ నెదర్లాండ్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్( Scott Edwards ) 78 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Telugu Bavuma, David Miller, Icc Odi Cup, Keshav Maharaj, Netherlands, Sa, Scott

దీంతో నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేసింది.అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు.డేవిడ్ మిల్లర్ 43,( David Miller ) కేశవ్ మహారాజ్( Keshav Maharaj ) 40 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లు నెదర్లాండ్ బౌలర్ల దాటికి తట్టుకోలేక త్వరగా పెవిలియన్ చేరారు.దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 42.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 27 పరుగులు చేసి 38 పరుగుల తేడాతో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది.సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ బవుమా( Bavuma ) మ్యాచ్ అనంతరం బాధతో నిరాశను వ్యక్తం చేశాడు.

Telugu Bavuma, David Miller, Icc Odi Cup, Keshav Maharaj, Netherlands, Sa, Scott

నెదర్లాండ్స్ జట్టు 112 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది.ఈ టీం ను 200 స్కోర్ దాటనివ్వకుండా ఉండాల్సింది.అక్కడే తాము పట్టు కోల్పోయామని తెలిపాడు.

తమ జట్టు ఛేజింగ్ చేసి పైచేయి సాధిస్తుంది అనే కాన్ఫిడెంట్ తో ఉన్నామని, అయితే తమ బ్యాటింగ్ లో ఉండే ఏదో లోపాన్ని నెదర్లాండ్ బౌలర్లు పసిగట్టారని అందుకే తమకు ఓటమి తప్పలేదని తెలిపాడు.మరొక పక్క తమ జట్టు బౌలర్లు కూడా కాస్త ఎక్కువ ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చారని, ఈ ఒక్క ఓటమితో తమ ప్రయాణం ఏమీ దెబ్బతినదని, ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని మిగతా మ్యాచ్లలో రాణిస్తామని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube