నేడు సౌత్ ఆఫ్రికా-పాకిస్తాన్ మ్యాచ్.. గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో సౌత్ ఆఫ్రికా జట్టు అద్భుతమైన ఫామ్ కొనసాగించి ప్రత్యర్థి జట్టులను భారీ పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.తాజాగా నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా పాకిస్తాన్-సౌత్ ఆఫ్రికా మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది.

 South Africa-pakistan Match Today Pakistan Will Be In Semis Race Only If They W-TeluguStop.com

నేటి మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పాలి.సౌత్ ఆఫ్రికా జట్టుపై గెలిస్తే పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.

లేకపోతే ఇక ఇంటికే.సౌత్ ఆఫ్రికా జట్టు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది.

రన్ రేట్ పరంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.కాబట్టి సౌత్ ఆఫ్రికా జట్టు కచ్చితంగా సెమీ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి.

Telugu Machidambaram, Odi Cup, Pakistan, Africa-Sports News క్రీడల�

ఇక భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా కచ్చితంగా సెమీఫైనల్ చేరుతుంది.అయితే సెమీఫైనల్ చేరే నాలుగో జట్టు కోసం రేసులో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.ఈ జట్లన్నీ మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఆ నాలుగు మ్యాచ్ చాలా ఫలితాలే ఏ జట్టు సెమీఫైనల్ చేరుతుందో నిర్ణయిస్తాయి.కాబట్టి నేడు జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టును పాకిస్తాన్( Pakistan ) కచ్చితంగా ఓడించాల్సి ఉంది.భారీ పరుగుల తేడాతో ఓడిస్తే రన్ రేట్ పరంగా కూడా పాకిస్తాన్ మెరుగ్గా ఉండి సెమీఫైనల్ చేరే అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి.


Telugu Machidambaram, Odi Cup, Pakistan, Africa-Sports News క్రీడల�

ఇప్పటివరకు పాకిస్తాన్- సౌత్ ఆఫ్రికా మధ్య 82 వన్డే మ్యాచ్లు జరిగితే.సౌత్ ఆఫ్రికా 51, పాకిస్తాన్ 30 మ్యాచ్లు గెలిచాయి.ఒక మ్యాచ్ రద్దయింది.ప్రపంచ కప్ పరంగా చూస్తే ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరిగితే దక్షిణాఫ్రికా( South Africa ) మూడు మ్యాచ్లు, పాకిస్తాన్ రెండు మ్యాచ్లు గెలిచాయి.

అంటే పాకిస్తాన్ జట్టు కంటే సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచే అవకాశాలే చాలా ఎక్కువ.పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ లో ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా రాణిస్తేనే సౌత్ ఆఫ్రికా పై గెలిచే అవకాశం ఉంటుంది.

మరి ఉత్కంఠ భరితమైన ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube