రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికలలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.15 డైరెక్టర్ స్థానాల్లో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.మరోవైపు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేస్తున్నారు.
ఇప్పటికే సెస్ ఎన్నికల ఫలితాలపై జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఈ క్రమంలో విజేతలతో కలిసి హైదరాబాద్ కు వెళ్లనున్నారు జిల్లా బీఆర్ఎస్ నేతలు.
అదేవిధంగా సెస్ ఛైర్మన్ అభ్యర్థిని మంత్రి కేటీఆర్ రేపు ప్రకటించనున్నారు.అయితే బీజేపీ నేతల ఆందోళనలతో కౌంటింగ్ ప్రక్రియ కాసేపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.