సరిగ్గా ఐదేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన చిత్రం శ్రీమంతుడు అందరికీ గుర్తుండే ఉంటుంది.మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుకు కొరటాల దర్శకం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో పేరు సంపాదించిపెట్టింది ఊరిని దత్తత తీసుకునే అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా భారీ కలెక్షన్లను వసూలు చేసింది.
తిరిగి ఇచ్చేయాలి లేదంటే లావైపోతారు అని డైలాగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.అయితే ఇదే స్టోరీలైన్ తో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఇలాంటి సినిమానే చేశారు అంటే నమ్మశక్యంగా లేదు కదా ? కానీ కానీ అదే నిజం.ఇది తెలుసుకోవాలంటే కొంచెం ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఏం జరిగిందో చూడాల్సిందే.
1984లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా జననీ జన్మ భూమి అనే సినిమా వచ్చింది.అందులో హీరో పేరు రమేష్.
ఓ కోటీశ్వరుని కొడుకు.సర్వసుఖాలు ఉన్నా ఏదో తెలియని వెలితితో బాధపడుతూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో హీరోయిన్ పద్మిని కారణంగా తన సొంత ఊరు వెళ్లి అక్కడి వాళ్ళ అ సాధక బాధలు తెలుసుకుని వారికి అండగా నిలవాలని అనుకుంటాడు హీరో.

అక్కడ ప్రతి పనికి అడ్డుపడే ప్రతి కథానాయకుడు అదే విలన్ అబ్బాయి నాయుడు అనే వ్యక్తి ఉంటాడు.మరి రమేష్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా ? కొడుకు వెళ్ళిపోయిన ఆవేదనతో ఎదురు చూస్తున్న తన కుటుంబం హీరో ఆచూకీ ఎలా కనుక్కుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే.

ఈ కథను పరిశీలిస్తే అచ్చం శ్రీమంతుడు సినిమా స్టోరీ లాగ అని అనిపిస్తుంది కదూ! కానీ అదే లైన్ తో వచ్చిన జననీ జన్మ భూమి అనే సినిమా అప్పట్లో హిట్ ను కొట్టలేకపోయింది.ఫైనల్ గా ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు.విశ్వనాధ్ గారు కళాత్మకంగా సందేశాత్మకంగా తీసినా, ఈ సినిమా ప్రజలకు అంతగా కనెక్ట్ కాలేదు.
అదీకాకుండా నందమూరి సినిమా అంటే భారీ ఫైట్లు, మసాలా సీన్స్ ఏవీ ఆ సినిమాలో లేకపోవడం వల్ల అది మంచి విజయం సాధించలేక పోయిందని పలువురి వాదన.

జననీ జన్మ భూమి అనే సినిమా మా మంచి కథతో తీసినా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.దీనికి సుప్రసిద్ధ రచయిత నరస రాజు గారు సంభాషణలు సమకూర్చగా, కె వి మహదేవన్ సంగీతాన్ని అందించారు.ఆ సినిమాలో బాలకృష్ణ తల్లిగా శారదగారు నటిస్తే, శ్రీమంతుడు సినిమాలో అలాంటి పాత్రని సుకన్య గారు చేశారు.
క్యారెక్టర్స్ పరంగా రెండు సినిమాల్లోనూ ఒకేరకమైన పోలికలు ఉంటాయి.జననీ జన్మభూమి సినిమాలో బాలకృష్ణకి తమ్ముడు ఉంటాడు.కానీ శ్రీమంతుడు సినిమాకి వచ్చేసరికి దానికి కొద్దిగా మార్చారు.ఏదేమైనా ఒకే రకమైన స్టోరీతో వచ్చినా కూడా దాదాపు 31 ఏళ్ల తర్వాత మళ్లీ అదే స్టోరీ సక్సెస్ ను సాధించడం అనేది నిజంగా గొప్ప విషయమే.