సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం అన్నీ మంచి శకునములే( Anni Manchi Shakunamule ).నందిని రెడ్డి( Nandini Reddy ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.కాగా ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో( Siddhu Jonnalagadda ) ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది.సిద్దు జొన్నలగడ్డ గురించి మనందరికీ తెలిసిందే.

హీరో సిద్దూతో ఇంటర్వ్యూ చేస్తే ఈ సినిమాకు హైపు వస్తుంది అనుకున్న చిత్ర యూనిట్ అసలు ఆవిరి అయ్యాయి.సిద్దు తన మాట తీరుతో డైలాగ్స్ వేయడంతో పాటు యూనిట్ పరువు తీసేసాడు.ఈ సందర్భంలోనే సినిమా జానర్ గురించి మాట్లాడుతూ.లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్యాన్సీ కూడా కలిపే లేకపోయావా అంటూ డైరెక్టర్ నందిని రెడ్డి పై సెటైర్లు వేస్తూ వెటకారంగా మాట్లాడారు సిద్దు జొన్నలగడ్డ.
అనంతరం మాళవిక పై సెటైర్ వేస్తూ నువ్వేంది ఎప్పుడు ఒకేలాంటి పాత్రలు చేస్తావు అంటూ ట్రోల్ చేశాడు.

ఆమె చేసిన పాత్రలు అలా ఉంటాయి ఇలా ఉంటాయి అంటూ కామెడీగా చెప్పుకొచ్చాడు సిద్దు జొన్నలగడ్డ.చివర్లో మళ్ళీ అన్నీ మంచి శకునములే సినిమా కూడా అలాంటిదే అంటూ మరో సెటైర్ వేశాడు.ఇక హీరో సంతోష్ శోభన్ అయితే సిద్దు మాటలకు బిక్క మొహం వేశాడు.
అసలు నువ్వు మూవీస్ ఎందుకు చేస్తున్నావు ప్రశ్నించాడు సిద్దు.ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కొద్దిసేపు మౌనంగా ఉండి పోయాడు సంతోష్ శోభన్.
మొత్తానికి ఈ ఇంటర్వ్యూ మొత్తం కామెడీ సెటైర్లతో సరదా సరదాగా సాగింది.చిత్ర యూనిట్ కూడా ఈ ఇంటర్వ్యూలో తెలుతేలికగా కామెడీగా తీసుకుంది.