సలార్ టీజర్ లో ప్రభాస్ కు ఎలివేషన్లు ఇచ్చిన ఈ తాత ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.సలార్ మూవీ టీజర్ కు ఇప్పటివరకు 35 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

 Shocking Facts About Salaar Actor Tinu Anand Details Here Goes Viral In Social-TeluguStop.com

ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటించగా టీజర్ లో మాత్రం శృతి హాసన్( Shruti Haasan)కు చోటు దక్కలేదు.అయితే సలార్ టీజర్ లో ప్రభాస్ పోషించిన సలార్ పాత్రకు సంబంధించి ఎలివేషన్లు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సలార్ లో ఎలివేషన్లు ఇచ్చిన ఆ తాత పేరు టీనూ ఆనంద్ కావడం గమనార్హం.తెలుగులో ఇప్పటికే పలు క్రేజీ సినిమాలలో ఈ నటుడు నటించారు.ఆదిత్య369, అంజి, సాహో సినిమాలలో నటించి ఈ నటుడు మెప్పించారు. సాహోలో అద్భుతంగా నటించడంతో ఈ నటుడికి సలార్ మూవీలో ఛాన్స్ దక్కిందని సమాచారం అందుతోంది.సీతారామమ్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఈ నటుడు మెప్పించారు.77 సంవత్సరాల వయస్సులో కూడా ఈ నటుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

టీను ఆనంద్ కుటుంబానికి చెందిన వాళ్లు సైతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సిద్దార్థ్ ఆనంద్( Siddharth Anand ) టీనూ ఆనంద్ కు మేనల్లుడు కావడం గమనార్హం.వార్, బ్యాంగ్ బ్యాంగ్, పఠాన్ సినిమాలతో సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.హిందీ సినిమాలలో టీనూ ఆనంద్ ఎక్కువగా నటించారు.

పాన్ ఇండియా ట్రెండ్ వల్ల టీనూ ఆనంద్( Tinnu Anand ) కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.టీనూ ఆనంద్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.సలార్ టీజర్ కు వ్యూస్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.సలార్ మూవీ నుంచి అతి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube