దివంగత వంగవీటి రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మరింది.టిడిపిలో ఉన్న రాధాకృష్ణ చాలా కాలంగా క్రియాశీలకంగా ఉండడం లేదు.
అసలు ఆ పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది.ఇక ఎప్పటి నుంచో ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది.
దిండిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నిర్వహించిన సమావేశంలోనూ రాధ కనిపించారు.అయితే కొద్ది నెలలుగా రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
దీంతో రాధ మళ్ళీ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.ఇక రంగ వర్ధంతి రోజున ఆయన విగ్రహానికి పూల మాల వేసిన రాధ ఈ సందర్భంగా మాట్లాడుతూ, వంగవీటి రంగ అభిమానులంతా ఏకం కావాలని రాధాకృష్ణ పిలుపునివ్వడం వెనుక కారణాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
రాధ టీడీపీ ని వీడే అవకాశం ఉందని, కీలక నిర్ణయం తీసుకునేందుకే రంగా అభిమానుల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.
వంగవీటి రంగ హత్య టిడిపి ప్రభుత్వ హాయంలో జరగడంతో, రంగాని చంపిన పార్టీలో రాధాకృష్ణ( Vangaveeti radhakrishna ) ఎందుకు ఉంటున్నారు అనే ప్రశ్న పదేపదే ఆయనకు ఎదురవడం, రాజకీయంగా ఇబ్బందికరంగా మారడంతో టిడిపిని వీడి జనసేనలో చేరాలని రాధాకృష్ణ చూస్తున్నారట.మంత్రి కొడాలి నాని, వంశీలు మాత్రం రాధను వైసీపీలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, జనసేన నేత పోతిన వెంకట మహేష్ తమ పార్టీలోకి రాధను తీసుకురావడం ద్వారా మరింత బలంజనసేనకు పెరుగుతుందనే లెక్కల్లో ఉన్నారు.కాపు సామాజిక వర్గానికి చెందిన రాధ మొదటి నుంచి మెగా ఫ్యామిలీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు.
చిరంజీవి( Chiranjeevi ) ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన వెంటనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు.ఇక తర్వాత నుంచి ఆయన రాజకీయ జీవితం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్న రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట.ఈ మేరకు జనసేన కీలక నాయకులు,పవన్ అభిమానులు, కాపు నేతలు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.