చిత్ర పరిశ్రమలో టాలెంట్ తో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్లు కొంతమంది.అయితే అదృష్టం కలిసి వచ్చి ఒక్కసారిగా కెరీర్ మలుపు తిరిగి స్టార్ గా ఎదిగిన వారు మరికొంతమంది.
చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన నటులు ఉన్నారు అని చెప్పాలి.అయితే ఇలా సినిమాల ద్వారా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారు కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంతమంది కేటుగాళ్ల మాటలు నమ్మి మోస పోవడం లాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటుంటారు.ఇక ఇలా మోసపోయే భారీగా లాస్ అయిన వాళ్లలో షావుకారు జానకి కూడా ఒకరు అని చెప్పాలి.
1950 దశకంలో అటు షావుకారు జానకి పలు భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగింది అని చెప్పాలి.ఇక అప్పట్లో మద్రాసులో ఉన్న సంపన్న కుటుంబాల జాబితాలో షావుకారు జానకి కుటుంబం కూడా ఒకటిగా ఉండేది.ఇక స్టార్ హీరోయిన్గా ఏకంగా హీరోలకు మించిన క్రేజ్ సంపాదించి వావ్ అనిపించింది.
కానీ ఒకానొక సమయంలో అవన్నీ పోగొట్టుకుని దుర్భర స్థితిని అనుభవించింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షావుకారు జానకి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది సినిమా వేరు జీవితం వేరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

జీవితంలో డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పిన షావుకారు జానకి ఇక మన ఆస్తుల విషయంలో వేరొకరి పెత్తనం ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్త వహించాలి అని తెలిపింది.ఈ విషయం ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు కొంతమందిని నమ్మడం వల్ల నేను ఉన్నదంతా పోగొట్టుకుని ఎంతగానో సమస్యలో కూరుకుపోయాను.ఒకానొక సమయంలో రోడ్డు మీదికి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి.12 ఎకరాల విలువైన భూమిని పోగొట్టుకొని ఎంతగానో కుంగి పోయాను.నా వాళ్ళే కదా అని నమ్మితే ఇలా నమ్మకద్రోహానికి గురయ్య.ఇది కొంతమందిలో ఈర్ష అసూయ జెలసీ లాంటివి నేను చాలా చూశాను.మనసుంటే చాలు అని అంటుంటారు చాలామంది.కానీ మనసుతో పాటు జీవితంలో డబ్బు కూడా ఉండాలన్నది నా అనుభవంతో తెలుసుకున్నాను.
కాపురం కాపాడుతారు అనుకునే వారే పాడు చేశారు జీవితంలో ఎవరినైనా ఒకరు నమ్మినప్పుడు ఇలా జరుగుతుంది అంటూ షావుకారి జానకి చెప్పుకొచ్చారూ.