ఓకే ఒక జీవితం స్పెషల్ ప్రీమియర్ కి సూపర్ రెస్పాన్స్..!

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒకే ఒక జీవితం.డ్రీం వారియర్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.

 Sharwanand Oke Oka Jeevitam Super Response From Special Premier,akhil, Amala Akk-TeluguStop.com

టైం టావెల్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బాగా ఉందని తెలుస్తుంది.సినిమా ట్రైలర్ తోనే ఆకట్టుకోగా రెండు రోజుల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమాని కొంతమంది సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.

కింగ్ నాగార్జునతో పాటుగా టాలీవుడ్ యువ దర్శకులు కొందరు ఈ సినిమా ప్రీమియర్ షోలో పాల్గొన్నారు.సినిమా ప్రీమియర్ షోలో మూవీ చూసిన వారందరు కూడా సూపర్ అనేశారట.

నాగార్జున అయితే సినిమా చూసి బాగా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది.అఖిల్ ఇంకా మిగతా డైరక్టర్స్ కూడా శర్వానంద్ కి కంగ్రాట్స్ అంటూ విషెష్ తెలియచేశారు.

మరి ఇదే మ్యాజిక్ రేపు థియేటర్ లో కూడా రిపీట్ అయితే శర్వానంద్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడినట్టే లెక్క. సినిమాలో అమల అక్కినేని కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

 నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా స్పెషల్ రోల్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube