రజనీకాంత్ ని చూడగానే పాదాభివందనం చేసిన ఐశ్వర్య.. ఫిదా అవుతున్న నెటిజన్స్!

ఐశ్వర్యరాయ్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.అందంలోనూ అభినయంలోనూ ఈమెకు ఎవరు సాటిరారని చెప్పాలి.

 Aishwarya Rai Saluted Rajnikanth Netizens Are Freaked Out Details, Aishwarya ,ra-TeluguStop.com

మాజీ ప్రపంచ సుందరిగా అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చెన్నైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమల్ హాసన్ రజనీకాంత్ వంటి స్టార్ సెలబ్రిటీలు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక వేదిక పైకి రజినీకాంత్ రాగానే ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం రజనీకాంత్ పేరుతో మారుమోగిపోయింది.

ఇక ఐశ్వర్యారాయ్ రజనీకాంత్ రాగానే ఒక్కసారిగా ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది.ఇలా ఐశ్వర్యరాయ్ ఒక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఏమాత్రం తన స్టార్ డమ్ చూపించకుండా ఎంతో వినయంతో తలైవాకు పాదాభివందనం చేశారు.

Telugu Aishwarya, Aishwarya Rai, Mani Ratnam, Kamal Hasan, Ponniyan Selvan, Raji

ఈ విధంగా ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ కు పాదాభివందనం చేసిన తర్వాత ఆయన తనని పైకి లేపడంతో ఇద్దరు చేతులతో ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్ లు ఐశ్వర్యరాయ్ వినయం చూసి ఫిదా అవుతున్నారు.ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ లాగే ఆమె మనసు కూడా ఎంతో అందమైనది అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఈమె సంస్కారానికి హాట్సాఫ్ అంటూ ఐశ్వర్యారాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube