మనలో అనేకమంది ఏ చిన్న అవసరం వచ్చినా ఎదుటి వారిపైన ఆధారపడుతూ వుంటారు.ఉదాహరణకు ఇంట్లో ఫ్యాన్ రిపేర్ అయితే వెంటనే ఎలక్ట్రీషియన్ దగ్గరకు పరుగెడతారు.
ట్యాప్ పాడైతే ప్లంబర్ దగ్గరకు పరుగెడతారు.వారు అందుబాటులో లేకపోతే, ఇక ఎన్నాళ్లయినా ఆ వస్తువులు అలాగే ఉండాల్సిందే.
అయితే కొంతమంది మాత్రం వారి మెదడుకి కాస్త పని చెబుతారు.దాంతో ఎవరి అవసరం లేకుండానే వారు ఆయా సమస్యలకు ఈజీ పరిస్కారాలు కనుక్కుంటూ వుంటారు.
ఈ క్రమంలోనే ఒకరు అద్భుతమైన ఐడియా చేసి, సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నారు.
బేసిగ్గా పల్లె అయినా, పట్టణం అయినా ఇపుడు దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటోంది.
ప్రతిఒకరి ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా, దోమల సమస్య మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది.
దాంతో నానా ఇబ్బందులు పడతారు.ఇదే క్రమంలో నోరులేని మూగ జీవులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
దాని వలన ప్రాణాంతక వ్యాధులు అనేకం పుట్టుకొస్తున్నాయి.ఇక ఇంట్లో ఉన్న దోమలను తరిమి కొట్టడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
పట్టణాల్లో ప్రజలు దోమలను అరికట్టేందుకు మార్కెట్లో దొరికే కొన్ని కాయిల్స్ ఉపయోగిస్తుంటే, గ్రామస్థులు మాత్రం స్వదేశీ పద్ధతులను అవలంబిస్తున్నారు.తాజాగా అలా చేసిన ప్రయత్నమొకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.గ్రామస్తులు బేసిగ్గా వేప ఆకులు, ఆవు పేడను కాల్చి పొగ పడుతుంటారు.ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఒక టెక్నిక్‌తో దోమలను తరిమికొట్టాడు.అతడు పెట్టిన పొగ ఇంటర్‌నెట్‌నే షేక్ చేసేలా ఉంది.సదరు వీడియోని పరిశీలిస్తే మనం వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూడవచ్చు.
దానికింద వేప ఆకులు మండుతున్నాయి.దాని కారణంగా చాలా పొగ రావటం, అది ఫ్యాన్ తిరిగే దశను బట్టి అన్ని వైపులా పొగ వ్యాపింపజేస్తుంది.
దాంతో దోమలు సమస్య తొలగి దగ్గరలో వున్న మూగ జీవాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.