ఓకే ఒక జీవితం స్పెషల్ ప్రీమియర్ కి సూపర్ రెస్పాన్స్..!
TeluguStop.com
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒకే ఒక జీవితం.
డ్రీం వారియర్ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.
టైం టావెల్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కూడా బాగా ఉందని తెలుస్తుంది.
సినిమా ట్రైలర్ తోనే ఆకట్టుకోగా రెండు రోజుల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమాని కొంతమంది సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ షో వేశారు.
కింగ్ నాగార్జునతో పాటుగా టాలీవుడ్ యువ దర్శకులు కొందరు ఈ సినిమా ప్రీమియర్ షోలో పాల్గొన్నారు.
సినిమా ప్రీమియర్ షోలో మూవీ చూసిన వారందరు కూడా సూపర్ అనేశారట.నాగార్జున అయితే సినిమా చూసి బాగా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది.
అఖిల్ ఇంకా మిగతా డైరక్టర్స్ కూడా శర్వానంద్ కి కంగ్రాట్స్ అంటూ విషెష్ తెలియచేశారు.
మరి ఇదే మ్యాజిక్ రేపు థియేటర్ లో కూడా రిపీట్ అయితే శర్వానంద్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడినట్టే లెక్క.
సినిమాలో అమల అక్కినేని కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా స్పెషల్ రోల్స్ చేశారు.
2024 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కిన తారలు వీళ్లే.. అన్యోన్యంగా ఉండాలంటూ?