ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి మేము చేస్తాం అనుమతులివ్వండి.. భార‌త్‌లో స్పుత్నిక్-వీ టీకా కోసం సీరం ద‌ర‌ఖాస్తు.. !

భార‌త్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సీరం తాజాగా మరో టీకా ఉత్పత్తి చేయడానికి సిద్దం అవుతుందట.అదీగాక అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ తయారు చేసిన వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించడానికి అన్ని సిద్దం చేసుకుందట.

 Serum Application For Sputnik V Vaccine In-india India, Serum Institute, Drug Au-TeluguStop.com

అయితే అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉండటంతో వేచి చూస్తుంది.

ఈ నేపధ్యంలో సీరం ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే మన దేశంలో స్పుత్నిక్-వీ వినియోగానికి డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే అలాగే రెడ్డీస్ ల్యాబ్ కూడా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది.కాగా సీరం కూడా ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం టీకా కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube