ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి మేము చేస్తాం అనుమతులివ్వండి.. భార‌త్‌లో స్పుత్నిక్-వీ టీకా కోసం సీరం ద‌ర‌ఖాస్తు.. !

భార‌త్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కొవిషీల్డ్‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సీరం తాజాగా మరో టీకా ఉత్పత్తి చేయడానికి సిద్దం అవుతుందట.

అదీగాక అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ తయారు చేసిన వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించడానికి అన్ని సిద్దం చేసుకుందట.

అయితే అమెరికా నుంచి మ‌రికొన్ని అనుమ‌తులు రావాల్సి ఉండటంతో వేచి చూస్తుంది.ఈ నేపధ్యంలో సీరం ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయ‌డానికి డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే మన దేశంలో స్పుత్నిక్-వీ వినియోగానికి డీసీజీఐ అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే అలాగే రెడ్డీస్ ల్యాబ్ కూడా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది.

కాగా సీరం కూడా ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తామ‌ని ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం ఏది ఏమైనా ఈ కరోనా మాత్రం టీకా కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తుందని తెలుస్తుంది.

కాబోయే భార్యతో అఖిల్.. నా సర్వస్వం నువ్వే అంటూ పోస్ట్… ఫోటో వైరల్!