పూరి శంకరాచార్యుల సంచలన వ్యాఖ్యలు... అమెరికా, ఫ్రాన్స్ లోకూడా కులాలను తీసుకురావాలంటూ!

RSS ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల కుల వ్యవస్థను ప్రవేశపెట్టింది దేవుడు కాదు, పండితులు అని చేసిన వ్యాఖ్యలపై ఇపుడు దేశమంతటా తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి.

ఇన్నాళ్లకైనా RSS నిజం ఒప్పుకుందని దాన్ని వ్యతిరేకించే వర్గాలు ఘోషిస్తుంటే, మరోపక్క ఈ వివాదాన్ని పూరి శంకరాచార్యులు నిశ్చలానంద సరస్వతి మరో మలుపు తిప్పడం కొసమెరుపు.

అవును, ఆయన తాజాగా మాట్లాడుతూ."కులాలను ప్రవేశపెట్టింది ఖచ్చితంగా దేవుడే.

వాటిని అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా అమల్లోకి తెస్తే బావుంటుంది!" అని అన్నారు.

కాగా ఈ మాటలు ఇపుడు మీడియాలలో చక్కెర్లు కొడుతున్నాయి.పెను దుమారాన్నే సృష్టించాయి అని చెప్పుకోవచ్చు.నిశ్చలానంద జగదల్పూర్‌లో ఈ సందర్భంగా మాట్లాడుతూ, "తొలి బ్రాహ్మణుడు బ్రహ్మే అని మర్చిపోవద్దు.

Advertisement

మీరు శాస్త్రాలు క్షుణ్ణంగా చదవాలి.అన్ని శాస్త్రాలను, కళలను బ్రాహ్మణులే వివరించి చెప్పగలుగుతారు.

విద్య, రక్షణ, ఇతర సేవల మధ్య సమతూకం అనేది ఉండాలి.RSSకు ఓ గ్రంథమంటూ ఏమీ లేదు.

అందుకే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారు" అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ."ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బ్రాహ్మణుల దగ్గరకే వస్తారు.అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వర్ణాల తరహాలో ప్రత్యామ్నాయ కుల వ్యవస్థ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అవసరం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

లేదంటే ఆయా దేశాలు ఇంకా దారిద్ర్యంలోకి నెట్టబడతాయి" అని అన్నారు.అంతేకాకుండా ప్రవక్త మహమ్మద్, జీసస్ క్రీస్తు పూర్వీకులు సనాతన హిందువులని నిశ్చలానంద అన్నారు.అలాగే మనదేశంలోని ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు