సారంగదరియా సాంగ్ కు దుమ్ములేపిన శేఖర్ మాస్టర్ కూతురు.. కానీ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఓ అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.

 Sekhar Master Shares Sahithi Saranga Dariya Sond Dance Steps, Shekar Master, Sa-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన సారంగదరియా అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో సాయి పల్లవి స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

ఈ పాటకు శేఖర్ మాస్టర్, అనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ అందించారు.ఈ పాట ఇప్పటికీ యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇంత ఫేమస్ అయిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఇదివరకే ఒక ఈవెంట్ లో భాగంగా ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి జూనియర్ సాయి పల్లవి అనిపించుకున్నారు.ఇదిలా ఉండగా సాహితీ మరోసారి సారంగదరియా పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆహా సరికొత్త కాంటెస్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

ఈక్రమంలోనే డాన్స్ దరియా అనే ఛాలెంజ్ ప్రారంభించారు.

ఈ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ పాటకు డాన్స్ వేసి వారికి పంపించాల్సి ఉంటుంది.ఇందులో భాగంగా ది బెస్ట్ ఫర్ ఫార్మర్ గా ఐదుగురిని ఎంపిక చేసుకొని వారికి స్మార్ట్ఫోన్లను ఆహా అందించనున్నట్లు ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఆహాలో లవ్ స్టోరీ సినిమా చూడటం మర్చిపోకండి.

అలాగే ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి #DanceDariyaChallenge#Love storyOn AHA అనే ట్యాగ్ తప్పుగా పెడితే వారిని డిస్క్వాలిఫై చేస్తారని,ఈ కాంటెస్టులో విజేతలు ఎవరు అనే విషయాన్ని నవంబర్ 3వ తేదీ ప్రకటిస్తారని ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube