దమ్ముంటే ఈ పని చేయాలంటూ బండి సంజయ్ కు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్

తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతున్న పరిస్థితి ఉంది.

 Minister Niranjan Reddy Challenged Bandi Sanjay To Do This If He Dared Telngana-TeluguStop.com

ఇటు ప్రభుత్వం కూడా బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రతి విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్తోంది.తాజాగా బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రభుత్వం వరి ఎందుకు కొనదో నేను చూస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం తమ దగ్గర పది సంవత్సరాలకు పైగా సరిపడా వరి ధాన్యం నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఒక సందర్భంలో మీడియాకు తెలపగా, తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనడం లేదని ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్న మీరు సాయంత్రం ఐదు గంటల లోపు వరి ధాన్యం కొనుగోలుకు అనుమతిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నుండి లెటర్ తీసుకురావాలని లేకపోతే బండిసంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

Telugu Bandi Sanjya, Bjp, Etala Rajender, Huzurabad, Kishan Reddy, Niranjan Redd

ప్రజల్లోకి అబద్దాలను తీసుకెళ్లవద్దని ప్రజలకు నిజాలు చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.అయితే మంత్రి చేసిన విమర్శలపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.అయితే బీజేపీ వేసిన ఈ వ్యూహంలో బీజేపీ చిక్కినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube