వంటల్లో కసూరి మేతిని వాడుతున్నారా.. మరి మీకు ఈ విషయాలు తెలుసా?

ఇటీవల వంటల్లో కసూరి మేతి ( Kasuri methi )వినియోగం భారీగా పెరుగుతోంది.మెంతికూరతో ఈ కసూరి మేతిని తయారు చేస్తారు.

 Wonderful Health Benefits Of Kasuri Methi , Kasuri Methi, Kasuri Methi Healt-TeluguStop.com

రుచికి కసూరి మేతి చేదుగా ఉన్నా.వంటల రుచిని మాత్రం అద్భుతంగా పెంచుతుంది.

అందుకే నిత్యం వాడే మసాలా దినుసుల్లో కసూరి మేతి ఒకటిగా మారిపోయింది.అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కసూరి మేతి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

దీనిలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.

Telugu Tips, Kasuri Methi, Kasurimethi, Latest-Telugu Health

రోజువారి వంటల్లో కసూరి మేతిని వాడటం వ‌ల్ల‌ బోలెడు హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.ముఖ్యంగా మధుమేహం( Diabetes ) వ్యాధిగ్రస్తులకు కసూరి మేతి ఒక వరం అనే చెప్పవచ్చు.ఎందుకంటే, కసూరి మేతి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

రోజూవారి వంటల్లో కసూరి మేతిని వాడటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

కసూరి మేతిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొట్ట అలర్జీలను తగ్గించి, పొట్టను శుభ్రపరుస్తుంది. మలబద్ధకంతో బాధ పడేవారు నిత్యం కసూరి మేతిని తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది.

ప్రసవం అనంతరం బాలింతలు కసూరి మేతిని తీసుకుంటే ఎంతో మంచిది. క‌సూరి మేతిలో ఉండే పోష‌కాలు బాలంత‌ల్లో పాల ఉత్పత్తిని చ‌క్క‌గా పెంచుతుంది.

Telugu Tips, Kasuri Methi, Kasurimethi, Latest-Telugu Health

ఆహారంలో కసూరి మేతిని చేర్చుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. అధిక బ‌రువు స‌మ‌స్య‌( Overweight )తో బాధ‌ప‌డుతున్న‌వారు క‌సూరి మేతిని డైట్ లో చేర్చుకుంటే అతి ఆక‌లి దూరం అవుతుంది.జీవ‌క్రియ రేటు ఇంప్రూవ్ అవుతుంది.దాంతో అధిక క్యాల‌రీలు వేగంగా బ‌ర్న్ అవుతాయి.అంతేకాదు క‌సూరి మేతిని తీసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.నెలసరి సమస్యలు( Monthly problems ) ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

మరియు హార్మోన్లను బ్యాలెన్స్ చేసే సామర్థ్యం కూడా కసూరి మేతికి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube