సారంగదరియా సాంగ్ కు దుమ్ములేపిన శేఖర్ మాస్టర్ కూతురు.. కానీ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ.

ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఓ అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన సారంగదరియా అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇందులో సాయి పల్లవి స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.ఈ పాటకు శేఖర్ మాస్టర్, అనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ అందించారు.

ఈ పాట ఇప్పటికీ యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇంత ఫేమస్ అయిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఇదివరకే ఒక ఈవెంట్ లో భాగంగా ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి జూనియర్ సాయి పల్లవి అనిపించుకున్నారు.

ఇదిలా ఉండగా సాహితీ మరోసారి సారంగదరియా పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆహా సరికొత్త కాంటెస్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.

ఈక్రమంలోనే డాన్స్ దరియా అనే ఛాలెంజ్ ప్రారంభించారు. """/"/ ఈ ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ పాటకు డాన్స్ వేసి వారికి పంపించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా ది బెస్ట్ ఫర్ ఫార్మర్ గా ఐదుగురిని ఎంపిక చేసుకొని వారికి స్మార్ట్ఫోన్లను ఆహా అందించనున్నట్లు ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఆహాలో లవ్ స్టోరీ సినిమా చూడటం మర్చిపోకండి.

దేవర రిజల్ట్ ఏంటి..? కొరటాల ఎన్టీయార్ కి మరో సక్సెస్ ఇచ్చాడా..?