నెల్లూరు జిల్లాలోని అధికార వైసీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి.గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ మధ్య జెడ్పీటీసీ, ఎంపీటీల మధ్య వివాదం రాజుకున్నట్లు సమాచారం.
ఈ వివాదాల కారణంగానే జెడ్పీటీసీ యామిని రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.మరోవైపు నెల్లూరు వైసీపీలో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మధ్య కూడా విభేదాలు రాజుకున్నాయి.
అబ్బాయ్ – బాబాయ్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది.డిప్యూటీ మేయర్ అనుచరుడి షాపు వద్ద మెట్లు తొలగించడంతో ఘర్షణ మరింత ముదిరింది.
కాగా ఈ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతుండగా పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.