ఒక్కోసారి కొంత మంది నటీనటులు అనుకోకుండా సినిమా పరిశ్రమకు వచ్చి ఒకటి, రెండు చిత్రాలలో నటించి తెరమరుగైన నటీనటులు చాలామందే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే ఇందులో 2011వ సంవత్సరంలో ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కిన “సత్య-2′ చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “అనైకా సోటి” కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో హీరోయిన్ గా నటించి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన మొదటి చిత్రం ఫ్లాప్ అవ్వడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోలేక పోయింది.అయినప్పటికీ పట్టు విడవకుండా అవకాశాల కోసం ప్రయత్నించింది.
దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోయినప్పటికీ కోలీవుడ్లో మాత్రం అడపాదడపా అవకాశాలు వరించాయి.
అయితే నటి అనైకా సోటి హీరోయిన్ గా నటించడానికంటే ముందుగా మోడలింగ్ రంగంలో పని చేసింది ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కంట్లో పడింది.
దీంతో రామ్ గోపాల్ వర్మ అనైక సోతి కి పిలిచి “సత్య 2” చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడికి నటనలో పెద్దగా అనుభవం లేకపోవడంతో రిజెక్ట్ చేసింది.అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ అనైకా ని ఒప్పించి మరీ సత్య 2 చిత్రంలో హీరోయిన్ గా నటింపజేశాడు.
కానీ ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ అనైకా సోటి ఈ మాత్రం నటనని విడిచి పెట్టకుండా మరిన్ని మెళకువలు నేర్చుకుని హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించింది.కాగా ఆ మధ్య తమిళ ప్రముఖ హీరో జీవా హీరోగా నటించిన “కీ” చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది.

ప్రస్తుతం అనైకా సోటి తమిళంలో రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళ ప్రముఖ దర్శకుడు “బద్రి వెంకటేష్” దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది.అయితే అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి ఉన్నప్పటికీ వాటిని నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో ఈ అందమైన బ్యూటీ హీరోయిన్ గా గుర్తింపు నోచుకోలేక మరుగున పడిపోయింది.కనీసం ఇప్పటికైనా దర్శకనిర్మాతలు ఈ యంగ్ బ్యూటీ ని ఆదరిస్తారో లేదో చూడాలి.