కందిరీగ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా పరిచయం అయిన వ్యక్తి సంతోష్ శ్రీనివాస్.సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ ప్రారంభించి తరువాత ఇతను దర్శకుడుగా మారాడు.
తరువాత రెండో సినిమానే ఏకంగా స్టార్ హీరో ఎన్ఠీఆర్ ని దర్శకత్వం చేసే అవకాశాన్ని సంతోష్ శ్రీనివాస్ సొంతం చేసుకున్నాడు.అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ రామ్ తో హైపర్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.కమర్షియల్ ఫార్ములా కథలతో దర్శకుడుగా తన ముద్ర చూపించుకున్న సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఈ దర్శకుడు ఉన్నాడు.
ఇదిలా ఉంటే తనకి మొదటి సక్సెస్ ఇచ్చిన కందిరీగకి సీక్వెల్ చేయాలని సంతోష్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్ తో సూపర్ హిట్ కొట్టి నెక్స్ట్ కందిరీగ 2 మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడు.ఇప్పటికే స్టోరీ లైన్ అనుకున్న స్క్రిప్ట్ రెడీ లేదు.రామ్ తో చర్చించిన తరువాత అతను ఒకే చెప్పగానే కందిరీగ 2 స్టార్ట్ చేయాలని సంతోష్ శ్రీనివాస్ అనుకుంటున్నాడు.
రెడ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా తర్వాత రామ్ ఇంకా ఎవరితో కూడా సినిమా కన్ఫర్మ్ చేసుకోలేదు.ఒక వేళ లైన్ లోకి సంతోష్ శ్రీనివాస్ వచ్చి తన కథతో మెప్పిస్తే కందిరీగ సీక్వెల్ చేయడానికి అతను కూడా ఆసక్తికరంగానే ఉన్నట్లు తెలుస్తుంది.