ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు వెండితెర మీద తమ అదృష్టం పరీక్షించుకుంటూ ఉన్నారు.వారిలో కొంత మంది సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్నారు.
కొంత మంది మాత్రం అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు.టాలీవుడ్ హీరోయిన్ అంజలి తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయినా ఆమెకి బ్రేక్ రావడానికి పదేళ్లు పట్టింది.
జర్నీ సినిమాతో తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకి కూడా ఆమె చేరువ అయ్యింది.తరువాత స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది.
కోలీవుడ్ లో అంజలికి మంచి క్రేజ్ ఉంది.అలాగే ఐశ్వర్య రాజేష్ తమిళంలో ఏకంగా 50 సినిమాలు చేసిన తర్వాత తెలుగులో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు కూడా ఐశ్వర్యని హీరోయిన్ గా తీసుకోవడానికిఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ టక్ జగదీశ్ సినిమా పూర్తి చేసింది.
అలాగే అయ్యప్పన్ కోషియమ్, పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలలో హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.ఇలా వీరి దారిలోనే అనేది కూడా తెలుగు నుంచి తమిళ్ కి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యి మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టి రెండు సినిమాలు చేస్తుంది.

వీరి కోవలోనే షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ప్రారంభించి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ 2016 కుందనపు బొమ్మ అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది.అయితే మొదటి సినిమానే ఆమెకి చేదు ఫలితం అందించింది.ఆ తరువాత శమంతకమణి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన తను అనే సినిమాలో బ్రహ్మానందం కొడుకుకి జోడీగా నటించింది.
ఈ సినిమా నటిగా గుర్తింపు ఇచ్చిన సక్సెస్ ఇవ్వలేదు.తాజాగా కలర్ ఫోటో సినిమాతో ఆమె కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది.ఈ సినిమా సక్సెస్ తో ఆమె ఫేమ్ లోకి వచ్చింది.
ఈ మధ్య బొంబాట్ అనే సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా కలర్ ఫోటో క్రేజ్ ఇంకా ఉంది.తాజాగా ఈ భామ మరో ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ మూవీకి ఒకే చెప్పేసింది.
కిరణ్ సబ్బవరం హీరోగా వస్తున్న నాలుగో సినిమా సమ్మతమేలో చాందినీ చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.ఈ సినిమాతో గోపీనాథ్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమా ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో సినిమా మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు.రాధాకృష్ణల ప్రేమకథ తరహాలో ఈ సినిమాలో లవ్ స్టోరీ ఉండబోతుందని పోస్టర్ తో రిప్రజెంట్ చేశారు.