స్టార్ హీరోయిన్ సమంత మరో లేడీ ఓరియంటెడ్ సినిమా కు కమిట్ అయినట్లుగా సమాచారం అందుతుంది.సౌత్ లో వరుసగా ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది.
ఇప్పటికే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు రెడీ గా ఉంది.ఈ సమ్మర్ లోనే ఆ సినిమా విడుదల కాబోతుంది.
తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఆ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
ఈ సమయం లోనే ఒక సౌత్ మూవీ లో నటించేందుకు సమంత ఒకే చెప్పిందని ఆ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది.ఒక వైపు హిందీ లో సినిమాలు మరియు సిరీస్ లను చేస్తున్న సమంత మరో వైపు విజయ్ దేవరకొండ హీరో శివ నిర్వాన దర్శకత్వం లో రూపొందుతున్న ఖుషి సినిమా లో కూడా నటిస్తోంది.ఈ నెలలో ఖుషి సినిమా లో నటించేందుకు సమంత డేట్లు ఇచ్చింది.
గతంలోనే ఖుషి సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వాల్సి ఉండగా సమంత ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడితూ వచ్చింది.ఎట్టకేలకు సమంత ఆరోగ్యం కుదుటపడడం తో విజయ్ దేవరకొండ కు డేట్లు ఇవ్వడం జరిగింది.రెండు నెలల్లోని సినిమా ను పూర్తి చేసి సమ్మర్ చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించే విధంగా సమంత ఆ సినిమా లో కనిపించబోతుంది.
మరో వైపు సమంత లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా మూవీ అధికారిక ప్రకటన రాబోతుంది.మొత్తానికి సమంత ఏ మాత్రం తగ్గడం లేదు.నాగచైతన్య నుండి విరాకులు తీసుకున్న తర్వాత సినిమాలు మరియు సిరీస్ ల విషయం లో మరింత స్పీడ్ గా వ్యవహరిస్తుంది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.