నెట్టింట్లో వైరల్ వీడియోలు ఎన్ని వున్నా, ఈ వీడియో వేరయా! అన్నట్టుంది ఇక్కడ కనిపించే వైరల్ వీడియో.అవును, సాధారణంగా మనం రోడ్లపై వెళ్ళేటప్పుడు మనకి అప్పుడప్పుడు గొర్రెలు మందలు, మేకల మందలు అనేవి కనబడుతూ ఉంటాయి.
అవి ఓ పట్టాన కాపరి మాట వినవు.దాంతో ఆ కాపరి వాహనదారులకు చోటు ఇవ్వలేక నానా అవస్థలు పడుతూ ఉంటాడు.
ఒక్కోసారి కొందరి చేత తిట్లు కూడా కాస్తూ ఉంటాడు.అయితే ఇక్కడ వైరల్ వీడియోలో కనిపించే కాపరి మాత్రం మామ్మూలు కాపరి మాత్రం కాదు.
అవును, అతడు నెక్స్ట్ లెవల్ గొర్రెల కాపరి. మారుతున్న కాలానికి అనుగుణంగా అతను చేసిన ఆలోచనలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.ఇలాంటి నయా ఐడియా మునిపెన్నడూ ఎవరూ చేసి వుండరు.గొర్రెలు అనేవి పేరుకి తగ్గట్టే వ్యవహరిస్తాయి.మేకలు ఓ రకంగా మాట వింటాయి కానీ, గొర్రెలు మాత్రం అలా కాదు.కొన్ని గొర్రెలు మందనుంచి తప్పి పోయినపుడు గొర్రెల కాపరుల బాధలు చూడాలి.
రాత్రనకా, పగలనకా తేడాలేక వాటిని వెతుకుతూనే వుంటారు.కొన్ని సార్లు వాటిని మేపేందుకు కాపర్లు జిల్లాలు దాటి మేత కోసం ప్రయాణాలు సాగిస్తుంటారు.
ఈ క్రమంలోనే రోడ్డుపై వాహనాలు, రైళ్ల కింద పడి పదులు, వందల సంఖ్యలో గొర్రెలు చనిపోయిన ఘటనలు కూడా చూస్తూ ఉంటాం.
అయితే ఇతగాడు చేసిన ఆలోచన చూస్తే గనుక.ఎలాంటి మాట వినని జంతువులైనా సరే వాటి గూటికి చేరాల్సిందే.ఈ ఆవిష్కరణను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
ఇక్కడ వీడియోలో, గొర్రెల కాపరి తన త్రీవీలర్‌పై కూర్చొని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఉంటే, గొర్రెలు అతను ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన మెష్‌తో ఎంచక్కా నడుచుకుంటూ వెనకే రావడం గమనించవచ్చు.కారు నడుపుతున్న వ్యక్తి కూడా రోడ్డుపై నెమ్మదిగా నడుపుతున్నాడు.
ఈ ఐడియా ఎలా వుందో చెప్పండి.