బాలీవుడ్ హీరో సినిమాకి గ్రీన్ సిగ్నలిచ్చిన సమంత.. ఫోటో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈక్రమంలోనే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Samantha Movie With Ranveer Sing In Bollywood , Samantha, Tollywood, Ranveer Sin-TeluguStop.com

ప్రస్తుతం యశోద సినిమాతో పాటు ఖుషి సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ఇక ఈ మూడు సినిమాలలో ఏ ఒక్కటి విడుదల కాకుండానే సమంత తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.ఇకపోతే తమిళ స్టార్ హీరోతోనే కాకుండా మరొక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినపడుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని స్వయంగా సమంత తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించినట్లు సమాచారం.బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో కలిసి సమంత దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇక ఈ ఫోటోని షేర్ చేయడంతో పాటు సమంత సమ్ థింగ్ బ్యూటీఫుల్ ఈజ్ ఆన్ ద హొరైజన్ అని సమంత క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Telugu Air Hostess, Bollywood, Ranveer Singh, Samantha, Shakuntalam, Vijay, Toll

ఈ సినిమా విశేషాలను సమంత త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.ఇక ఇందులో సమంత ఎయిర్ హోస్టెస్ డ్రెస్ లో కనిపించగా ఈమె ఈ సినిమాలో ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే రణవీర్ సమంత నటించిన ఐటమ్ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం మనకు తెలిసిందే.ఈ పాటలో ఏముందో తెలియదు కానీ ఈ పాటకు సమంత స్టెప్పులు ఇరగదీసిందని, ఈ మ్యూజిక్ తన మనసును తాకింది అంటూ రణవీర్ ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపించారు.

అయితే వీరిద్దరి సినిమాకు సంబంధించిన ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube