ఇతర వృత్తులతో పోల్చి చూస్తే వైద్య వృత్తి అత్యంత కష్టమైన వృత్తి అనే సంగతి తెలిసిందే.వైద్యులు ఏ మాత్రం పొరపాట్లు చేసినా ఆ ప్రభావం ఒక ప్రాణంపై పడుతుంది.
అయితే దగ్గరి వాళ్లు వైద్య వృత్తి వద్దని చెప్పినా అత్తలూరి సాయి అనిరుధ్ ( Attaluri Sai Anirudh )మాత్రం తొమ్మిది బంగారు పతకాలతో ఎంబీఎస్ పూర్తి చేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.తన సక్సెస్ తో అనిరుధ్ ప్రశంసలు అందుకుంటున్నారు.
కాకినాడకు చెందిన అనిరుధ్ సీనియర్ ప్రొఫెసర్లు, సబ్జెక్టుల ( Senior Professors, Subjects )నిపుణులతో సావాసం చేసి ఏ సందేహం వచ్చినా వాళ్ల సహాయంతో నివృత్తి చేసుకునేవాడు.అనిరుధ్ తల్లీదండ్రులు డాక్టర్లు కాగా ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం అనిరుధ్ గమనించారు.
సీ.బీ.ఎస్.ఈలో పదో తరగతిలో టాపర్ గా నిలిచిన అనిరుధ్ ఇంటర్ లో జిల్లా టాపర్ గా నిలిచాడు.

ఎంబీబీఎస్ లో ఏకంగా తొమ్మిది బంగారు పతకాలతో ఎన్టీఆర్ యూనివర్సిటీ ( NTR University )టాపర్ గా నిలిచిన అనిరుధ్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ప్రస్తుతం అనిరుధ్ హౌస్ సర్జన్ శిక్షణలో ఉన్నారు.భవిష్యత్తులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుతానని చెబుతున్న అనిరుధ్ పేదలకు తన వంతు సహాయం చేస్తానని చెబుతుండటం గమనార్హం.

సాయి అనిరుధ్ తన ప్రతిభతో ఇతర ఘనతలను సైతం సొంతం చేసుకున్నారు.మంగళగిరి ఎయిమ్స్ లో కొలక్విమ్( Colloquium in Mangalagiri AIIMS ) 2020 సదస్సులో స్వర్ణం సొంతం చేసుకున్న అనిరుధ్ విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల జాతీయస్థాయి అనాటమీ సెమినార్ లో గోల్డ్ మెడల్ సాధించారు.సాయి అనిరుధ్ సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
ప్రముఖ మ్యాగజైన్లలో సాయి అనిరుధ్ రాసిన విశ్లేషణలు ప్రచురితమయ్యాయి.సాయి అనిరుధ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.