తెలంగాణలో నేటి నుంచి రైతుబంధు విడుదల

తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ మేరకు ఇవాళ పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించనుంది.యాసంగి సీజన్ కోసం 70.54 లక్షల రైతుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనుంది.తొలిరోజు ఎకరం ఉన్న 21,02,822 మంది రైతుల అకౌంట్లలో అధికారులు డబ్బులు జమ కానున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇవాళ రూ.607.31 కోట్లను విడుదల చేసినట్లు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.

 Rythu Bandhu Will Be Released In Telangana From Today-TeluguStop.com

రేపు రెండు, ఎల్లుండి మూడు ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.ఈ విధంగా రోజుకో ఎకరా విస్తీర్ణం పెంచుతూ జనవరి 15వ తేదీలోగా రైతులందరికీ నగదు డిపాజిట్ చేయనుంది.కాగా మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది.ఇప్పటివరకు రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది విడతలగా రైతులకు సాయాన్ని అందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube