విదేశాలలో ఉంటూ తెలంగాణలో రైతు భందు పధకానికి అర్హులుగా ఉన్నటువంటి ఎన్నారైలకి చెక్కులు అందించడానికి టీజీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందుకోసం కొన్ని వెసులు బాట్లు కూడా కల్పించింది
ఎన్నారై పట్టాదారులకు బదులుగా వారి కుటుంబ సభ్యులకు డిక్లరేషన్ తీసుకుని రైతుబంధు చెక్కులు ఇవ్వాలని కీలక ఆదేశాలు జారీ చేసింది…దాంతో రాష్ట్రంలో 61 వేల రైతు కుటుంబాలకు చెక్కులు అందనున్నాయి.
ఈ రైతుబంధు పథకంలో భాగంగా రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన 58.33 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేసేందుకు 58.99 లక్షల చెక్కులు ముద్రించారు.విదేశాల్లో ఉంటున్న పట్టాదారుల చెక్కులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉండిపోయాయి.
ఎన్నికల సమయంలో ఈ చెక్కులను వెనక్కి తీసుకోవడం కంటే ఎన్నారైల కుటుంబ సభ్యులకు ఇవ్వడమే బాగుంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.
దాంతో గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న వారందరికీ చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఎన్‌ఆర్‌ఐలు డిక్లరేషన్ పంపిస్తే…అప్పుడు ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తారు…ఇదిలాఉంటే చనిపోయిన రైతుల పేరు మీద 90 వేల చెక్కులు ఉన్నాయి అయితే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు అయితే ఎన్నారైల ఓట్లు కీలకం అవడంతో ప్రభుత్వం తప్పక ఈ ప్రకటన విడుదల చేయక తప్పలేదు.