ఆర్ఆర్ఆర్ మూవీ మెయిన్ విలన్ రే స్టీవెన్సన్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు!

దాదాపుగా 14 నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ( RRR Movie ) అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో రే స్టీవెన్సన్ నటించి తన ఆద్భుతమైన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.

 Rrr Movie Actor Ray Stevenson Passed Away Details Here Goes Viral,rrr Movie, Ray-TeluguStop.com

రే స్టీవెన్సన్( Ray Stevenson ) అభినయం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది.గవర్నర్ స్కాట్ బక్స్ టన్ పాత్రలో నటించి రే స్టీవెన్సన్ ఈ సినిమా సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషించారు.

Telugu Hollywood, Rajamouli, Ray Stevenson, Rrr, Thor-Movie

అయితే ఈ నటుడి పేరు వింటే ప్రేక్షకులు గుర్తు పట్టలేరేమో కానీ ఈయన పాత్రకు సంబంధించిన ఫోటోలు చూస్తే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు.అయితే ఈ ప్రముఖ నటుడు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారని తెలుస్తోంది.రే స్టీవెన్సన్ మరణ వార్త గురించి తెలిసి ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.ప్రముఖ సినీ నటులు, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిగా రా స్టీవెన్సన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఆయన అకాల మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.రే స్టీవెన్సన్ మృతి గురించి ఆర్ఆర్ఆర్ యూనిట్ స్పందిస్తూ వైరల్ అవుతున్న వార్త మమ్మల్ని ఎంతగానో షాక్ కు గురి చేసిందని తెలిపింది.

రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి కలగాలని మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారని ఆర్ఆర్ఆర్ యూనిట్ పేర్కొంది.హాలీవుడ్ ఇండస్ట్రీ( Hollywood Industry )లో రే స్టీవెన్సన్ కు మంచి గుర్తింపు ఉంది.

Telugu Hollywood, Rajamouli, Ray Stevenson, Rrr, Thor-Movie

థోర్ సిరీస్( Thor Series ) ల ద్వారా ఈ నటుడు ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.నార్త్ ఐర్లాండ్ లో జన్మించిన రే స్టీవెన్సన్ కెరీర్ తొలినాళ్లలో టీవీ షోలలో నటించి ఆ తర్వాత రోజుల్లో హాలీవుడ్ సినిమాలలో నటించారు.థియెరీ ఆఫ్ ఫ్లైట్ ఆయన తొలి సినిమా అనే సంగతి తెలిసిందే.డెక్స్ టార్, స్టార్ వార్స్ రెబెల్స్ టీవీ షోలు ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube