తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించడం చాలామంది కల అనే సంగతి తెలిసిందే.ఈ కలను నెరవేర్చుకోవడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి.
అయితే ఒక యువతి మాత్రం సులువుగానే కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. బిర్యానీ( Biryani ) అమ్ముతూ బెంగళూరు యువతి ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారు.
5 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం 10 కోట్ల రూపాయల టర్నోవర్ తో రమ్య రవి( Ramya Ravi ) వ్యాపారాల్లో రాణించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిర్యానీ పేరు వినగానే హైదరాబాద్ గుర్తొస్తుంది.
అయితే బెంగళూరు వాసులకు దొన్నె బిర్యానీ అనే పేరు వింటే మాత్రం వెంటనే ఆర్.ఎన్.ఆర్ దొన్నె బిర్యానీ( RNR Donne Biryani ) గుర్తుకొస్తుంది.బీకామ్ చదివిన రమ్య రవి హార్వర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సును సైతం పూర్తి చేశారు.
కరోనా సమయంలో రమ్య రవి 200 అడుగుల స్థలంలో బెంగళూరులో నాగరబావి ప్రాంతంలో హోటల్ ను మొదలెట్టారు.
ఒక వంటవాడితో ప్రారంభమైన ఈ హోటల్ రమ్య రవికి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది.బిజినెస్ మొదలుపెట్టిన మొదటి నెలలోనే ఏకంగా 10,000 డెలివరీలను అందించి రమ్య రవి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్నారు.ఆ తర్వాత రమ్య రవి బెంగళూరులోని జయ నగర్ లో రెస్టారెంట్ ను మొదలుపెట్టారు.
టిన్ బాక్స్ లలో బిర్యానీ అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత.
తన కృషికి అదృష్టం కూడా కలిసిరావడంతో రమ్య రవి పట్టిందల్లా బంగారం అవుతోంది.రమ్య రవి రాబోయే రోజుల్లో కూడా వ్యాపారవేత్తగా మరింత ఎదిగి విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేసున్నారు.రమ్య రవి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించే ఎంతోమందికి ఆమె స్పూర్తిగా నిలిచారు.