పసికూన నెదర్లాండ్స్ చేతిలో బంగ్లా ఓటమికి ప్రధాన కారణం అదే..!

ప్రపంచ కప్ టోర్నీలోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన పసికూన నెదర్లాండ్స్ (Netherlands)జట్టు టోర్నీలో ఉండే మిగతా జట్లకు ఊహించని షాక్ లు ఇస్తోంది.దక్షిణాఫ్రికా (South Africa)జట్టుకు ఊహించని ఓటమి ఇచ్చిన నెదర్లాండ్స్ జట్టు తాజాగా బంగ్లాదేశ్ జట్టును కూడా చిత్తుగా ఓడించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Reason Behind Bangladesh Loss To Netherlands In World Cup Details ,bangladesh ,n-TeluguStop.com

బంగ్లాదేశ్ జట్టును ఏకంగా 87 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ఓడించింది.

ఈడెన్ గార్డెన్స్(Eden Garden) వేదికగా జరిగిన బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బ్యాటర్లైన స్కాట్ ఎడ్వర్డ్ 68,(Scott Edward) వెస్లీ బారెసి 41,(Wesley Baresi) సైబ్రాండ్ 35 పరుగులు చేశారు.

స్వల్ప లక్ష్య చేదనకు దిగిన బంగ్లా జట్టు త్వరగా మ్యాచ్ పూర్తి చేస్తుంది అనుకుంటే.బంగ్లాదేశ్ (Bangladesh)42.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులకే కుప్పకూలింది.మెహిదీ హసన్ మిరాజ్(Mehdi Hasan Miraj) 35 పరుగులు చేయగా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు చాలా ఘోరంగా విఫలమయ్యారు.

Telugu Bangladesh, Eden Garden, Icc Cricket Cup, Netherlands, Scott Edward, Shak

బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan) ఓటమిపై స్పందిస్తూ.బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని తెలిపాడు.తమ జట్టు బౌలింగ్ బాగానే చేసిందని, నెదర్లాండ్స్ జట్టు ను 170 పరుగులకే కట్టడి చేసి ఉంటే బాగుండేదని తెలిపాడు.

అసలు ఇది బంగ్లా జట్టేనా అనేలా మా ఆట తీరు ఉంది.తర్వాత మ్యాచ్ లలో కూడా తమ జట్టుకు అన్ని కఠిన సవాళ్లే ఎదురవుతాయి.తర్వాత మ్యాచ్ లలో ధైర్యంగా తమ జట్టు ముందుకు సాగుతుందని చెప్పాడు.

Telugu Bangladesh, Eden Garden, Icc Cricket Cup, Netherlands, Scott Edward, Shak

ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.ఈ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటివరకు బ్యాటింగ్ పరంగా తమ బంగ్లాదేశ్ జట్టు పూర్తిగా విఫలం అయిందని కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో ఓడింది.

ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.కనీసం అందులో రెండు మ్యాచ్ లు నైనా గెలిచి తమ పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube