రవితేజ సినిమా ఎందుకు ఇంత గందరగోళం బాసూ?

మాస్‌ మహారాజా రవితేజ ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Ravi Teja And Sharath Mandava Movie Title Not Mro, Flimnews, Khiladi, Mro, Ravit-TeluguStop.com

ఇక తాజాగా ఖిలాడి సినిమా తో ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.పెద్ద మొత్తంలో ఈయన సినిమాలు రూపొందుతున్నాయి.

ఒక వైపు ఖిలాడి ని పూర్తి చేసి మరో వైపు శరత్‌ మండవ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రవితేజ సిద్దం అయ్యాడు.ఇపపటికే సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడంతో పాటు ప్రీ లుక్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు.

మొదట ఈ సినిమా లో రవితేజ ఎమ్మార్వో గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఎమ్మార్వో లా కాకుండా జాయింట్‌ కలెక్టర్‌ గా కనిపించబోతున్నాడు అంటున్నారు.

Telugu Khiladi, Raviteja, Sharath Mandava-Movie

ఈ సినిమాకు ఎమ్మార్వో అనే టైటిల్‌ ను ఖరారు చేశారు అంటూ వార్తలు వస్తున్న సమయంలో జాయింట్‌ కలెక్టర్‌ గా రవితేజ నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తల వల్ల గందరగోళంగా మారింది.రవితేజ ఇంతకు ఎమ్మార్వో గా కనిపిస్తాడా లేదా జాయింట్‌ కలెక్టర్ గా వస్తాడా అనేది చూడాలి.పెద్ద మొత్తంలో అంచనాలు ఉన్న ఈ సినిమా విషయంలో కాస్త గందరగోళం గా ఉన్న నేపథ్యంలో వెంటనే మేకర్స్‌ స్పందించాలంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ట్రెండ్‌ ఏంటీ అంటే మాస్‌ టైటిల్స్‌.

మరి ఈ సినిమా కు ఎమ్మార్వో టైటిల్‌ నిజం కాదని తేలిపోయిన నేపథ్యంలో మరే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో చూడాలి.ఖిలాడి సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

కరోనా అనుకూలిస్తే రవితేజ ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేస్తానంటున్నాడు.జాయింట్‌ కలెక్టర్‌ సినిమా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తామని అంటున్నారు.

కనుక విడుదల విషయంలో ఈ ఏడాదా వచ్చే ఏడాదా అనే అనుమానాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube