ఏదైనా సరే రిపీట్ చెయ్యడం నాకు నచ్చదు.. రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం.ఈ సినిమాను డి.

 Rana Daggubati About Story Selection,rana Daggubati,sai Pallavi,venu Udugula,vir-TeluguStop.com

సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఒక యాక్టర్‌గా అన్ని రకాల జానర్స్‌ చేయాలనుకుంటాను.

కానీ ఒకసారి చేసిన జానర్‌ను రిపీట్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు అని తెలిపారు రానా.

అలాగే ఓ మంచి కథను చెప్పాలంటే హీరోగానే చెప్పాల్సిన అవసరం లేదు, బలమైన పాత్రలతో కూడా చెప్పొచ్చుఅని హీరో రానా తెలిపారు.సమయాన్ని రీ క్రియేట్‌ చేయడం ఒక్క సినిమాకే సాధ్యం.

విరాటపర్వం చిత్రం 1990 సమయంలో జరిగే కథ.ఈ చిత్రంలో రవన్న అనే ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాను అని చెప్పుకొచ్చారు రానా.డాక్టర్‌ అయిన రవన్న అప్పటి సామాజిక పరిస్థితులు, అతని జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల కారణంగా ఉద్యమకారుడిగా మారతాడు.ఈ పాత్రకి ప్రత్యేకంగా ఎవర్నీ స్ఫూర్తిగా తీసుకోలేదు.కానీ, చెగువేరా వంటి నాయకుల ప్రభావం రవన్న పాత్రలో బాగా కనిపిస్తుంది అని తెలిపారు రానా.

Telugu Rana, Rana Daggubati, Rana Interview, Ravanna Role, Sai Pallavi, Tollywoo

అదే విధంగా ఒక లోతైన సముద్రంలోకి తోసేస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో విరాటపర్వం కథ విన్నప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది.మనసుకు అంత బరువుగా అనిపించింది. సీరియస్‌ టోన్‌తో చెప్పాల్సిన నిజాయితీ కథ ఇది అని చెప్పుకోచ్చారు.

ఇకపోతే విరాటపర్వం సినిమా విషయానికి వస్తే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రానా అభిమానులు సాయిపల్లవి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube