ఆత్మ ప్రక్షాళన రంజాన్ దీక్ష‌ల ఆంత‌ర్యం

పవిత్ర రంజాన్‌ మాస ఉప వాస దీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

 Ramzan Stats From Tommarrow-TeluguStop.com

మహమ్మదీయుల పవిత్ర గ్రంథం “ఖురాన్” ఆవిర్భవించిన పుణ్యమాసం రంజాన్… ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠ నియమాలతో గడిపే ఈ మాసం ఇస్లామ్ కేలండర్‌లో ఒక నెలపేరు.ఇది ఇస్లామ్ కేలండర్ నెలల క్రమంలో తొమ్మిదోది.”రంజాన్ లేగా రమదాన్” అని పిలిచే ఈ మాసంలో మహమ్మదీయులు ఉపవాస దీక్షను ఆచరించే ఉప‌వాస దీక్ష‌లు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

ఆత్మ ప్రక్షాళనకు త్రికరణ శుద్ధితో ఉండే ఉపవాస వ్రతాన్నే ”రోజా’.ఈ ఉపవాసాల వలన మానవాళి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది.ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే ఈ ఉపవాసాల ఉద్దేశం.ఈ మాసంలో పేదవాడికి ఒక పూట భోజనం పెడితే ఆ అల్లా 1000 పూటల ఆహారం ప్రసాదిస్తాడని విశ్వాసం.

వారిది.రంజాన్ ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా ఉపవాస దీక్షలతో, క‌ఠిన‌ నిష్ట నియమాలతో కూడుకున్న జీవితం గడుపుతారు.! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే.రంజాన్‌ మాసంగా చెప్ప‌వ‌చ్చు.

తెల్లవారుజామున మాత్రమే ఆహారం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీక్షను విరమిస్తారు.తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని “సహర్” అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని “ఇఫ్తార్” అని అంటారు.

రంజాన్ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు.ఉపవాసదీక్ష పాటించేవారు అసత్యాలు ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడుపుతారు.

ఇంకా శారీరక, మానసిక వాంఛలకు దూరంగా ఉంటూ నిగ్రహంతో దైవచింతనతో గడుపుతూ వుంటారు.

ఇప్పటికే మసీదులన్నీ నమాజ్‌ చేసుకునేందుకు సిద్ధం కాగా, ఇప్పటికే దాదాపు అన్ని మసీదులలో ఉపవాస దీక్షల కార్యక్రమాల వివరాలను తెలియజేయడంతోపాటు కాలనిర్ణయ పట్టికలను కూడా పంపిణీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube