వైకాపా అధ్యక్షుడు జగన్‌పైకి ఆ పార్టీని వీడి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్ల్యేలతోనే విమర్శలకు శ్రీకారుం చుట్టింది తెలుగుదేశం పార్టీ.ఈ క్రమంలో పాతపట్నం శాసనసభ్యుడు కలమట వెంకటరమణ మీడియాతో తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు.రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ చేసిన అన్యాయం సరిదిద్దుతూ ఆర్ధికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టినందుకా ? కష్టకాలంలో సైతం ఇచ్చిన మాటకు నిలబడి, వైకాపా అధ్యక్షులు సాధ్యం కాదని చెప్పిన రుణమాఫీని ప్రతి రైతు కుటుంబానికి రూ.1.50 లక్షలు మాఫీ చేసినందుకా? చంద్రబాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ వైఖరి నచ్చకే 19 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వైకాపా నుంచి బయటకు వచ్చేసినా ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నట్టు కనిపించడంలేదని, విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడిపై పువ్వులు వేయాలని ఆయన స్పష్టం చేశారు.
అవినీతి సొమ్ముతో తెలుగుదేశం తమను కొనుగోలు చేసిందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆయన మండి పడ్డారు.ఇటువంటి మాటలు మానుకోకుంటే ప్రజలు మరోసారి తగురీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యప్తంగా జగన్ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధయ్యింది.ఇవ్పటికే జగన్ రోడ్ షోనిర్వహిస్తున్న ప్రాంతాలలో రాస్తారోకోలు జరుపుతున్న దేశం కార్యకర్తలు ్రపణాళికా బద్ధంతో ముందుకు సాగేలా సీనియర్లు కొందరిని రంగంలోకి దించినట్టు వినవస్తోంది.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌పై పలు పోలీసు ఠాణాలలో కేసులు నమోదు చేయాలని సూచనలందినట్లు సమాచారం
.