ఓ పెద్ద గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే దాని ప్రక్క మరో పెద్ద గీత గీయడమే అన్నది ఓ యుక్తి.ఇప$డు అదే సూత్రాన్ని వైకాపా అధ్యక్షుడు వైఎస్.
జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికే ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతర కరమంటూ తెలుగుదేశం శ్రేణులు మండి పడుతూ, జగన్ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రని అడుగడుగునా అడ్డుకుంటున్న నేపధ్యంలో జగన్ మరో ముందడుగు వేసి… సిఎంకి చీపుర్లు కూడా చూపాలంటూ దేశం వర్గాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన.
అనంత జిల్లాలో జరుగుతున్న జగన్ రైతు భరోసా యాత్ర లో యుద్ధకాండలు, కత్తులు దూసుకోవటాలు తదితర సంఘటనలు జరుగుతున్నా… జగన్ క్షమాపణ చెప్పే ప్రశ్నలేదంటూ,ప్రజల పక్షాన కాస్త కఠినంగా మాట్లాడితే కోపమేమో చెప్పులు కాదు రానున్న రోజుల్లో చంద్రబాబుకు చీపుర్లు చూపాలేమో తనదైన శైలిలో చంద్రబాబుపై ధ్వజమెత్తడం దేశం వర్గాలలో చిందులు తొక్కించేలా చేసింది.ఇప్పటికే దేశం వర్గాలు జగన్‌పై అనంతలోని పలు పోలీసు ఠాణాలలో కేసులు నమోదు చేసిన విషయం విదితమే.
కాగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నేతల నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమాన్న అడ్డుపెట్టి రైలు తగలబెట్టడం ద్వారా రాష్ట్రంలో కలకలం సృష్టించారని, అది రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రంలో శాంతి భ్రధతలు లోపించాయని ప్రచారం చేసుకోవాలని పన్నిన వ్యూహాలు విఫలం కావటంతో, ఇప్పుడు దేశం వర్గాలనే రెచ్చగొట్టడం ద్వారా తను అనుకున్న లక్ష్యం కోసమే జగన్ తన వ్యాఖ్యలను పొడిగిస్తున్నారని దేశం సీనియర్లు కొందరు చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం.ఈ ్రకమంలో జగన్‌కు తమదైన శైలిలో నిరసనలు తెలపాలి మినహా ప్రజలు ఇబ్బందులు పడేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వద్దని జిల్లా తెలుగుదేశం అధ్యక్షులకు స్పష్టమైన ఆదేశాలందింనట్టు సమాచారం.
దీంతో జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుబాస్‌కి సైతం సూచించినట్లు తెలుస్తోంది.







