బీజేపీకి ఆయుధం.. డైలమాలో ఇండియా కూటమి !

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 26 పార్టీలు కూటమిలో భాగమయ్యాయి.

 Weapon For Bjp.. India Alliance In Dilemma! , Bjp , M K Stalin . India Alliance-TeluguStop.com

ప్రస్తుతం మోడి సర్కార్( Narendra Modi ) ను ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటోంది విపక్ష ఇండియా కూటమి.ఎన్నికలు ఎంతో దూరంలో లేకపోవడంతో మోడి సర్కార్ వైఫల్యలు, గత తొమ్మిదేళ్ళలో జరిగిన అవినీతి.

ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనమైన మణిపూర్ అల్లరు.ఇలా అన్నిటిని ఆయుధాలుగా మలచుకొని మోడి సర్కార్ పై దండెత్తుతోంది.

అయితే విపక్ష కూటమిని ఎదుర్కోవడానికి సాధారణ విమర్శలు తప్పా కూటమిని దెబ్బ తీసేలా బీజేపీ వద్ద ఎలాంటి వ్యూహరచన లేదు.

Telugu Congress, Dengue, Stalinindia, Narendra Modi-Politics

కానీ తాజా పరిణామాలు చూస్తే విపక్ష కూటమే బీజేపీకి ఆయుధమిచ్చినట్లైంది.విపక్ష ఇండియా కూటమిలో తమిళనాడు అధికార పార్టీ అయిన డీఎంకే( DMK ) భాగమనే సంగతి తెలిసిందే.ఈ పార్టీకి చెందిన మంత్రి ఉదయానిధి స్టాలిన్( Udhayanidhi Stalin ) తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమిని చిక్కుల్లో నెట్టే విధంగా కనిపిస్తున్నాయి.సనాతన దర్మాన్ని నిర్మూలించాలని, అది డెంగ్యూ, మలేరియా, కరోనా లాగా ప్రమాదమైనదని మతపరామిన వివాదాస్పద చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది.సనాతన దర్మాన్ని తప్పుబడితే.

భారతీయ మాటలను అవమానించినట్లేనాని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.

Telugu Congress, Dengue, Stalinindia, Narendra Modi-Politics

ఉదయనిధి స్టాలిన్ హిందూధర్మంపై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారాని.హిందూ వాదాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ.ఈ వివాదం ప్రస్తుతం పెద్దదౌతుండడంతో విపక్ష ఇండియా కూటమి డిఫెన్స్ లో పడినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే తాను చేసిన వ్యాఖ్యలకు స్టాలిన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన లాభం లేకపోయింది.

ప్రస్తుతం ఈ వివాదాన్ని బీజేపీ( BJP ) చిలికి చిలికి గాలివానగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి మతపరమైన వ్యాఖ్యలతో ఇండియా కూటమి సెల్ఫ్ డిఫెన్స్ లో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube