ప్రజల అభివృద్దే తన లక్ష్యంగా తను ముందుకు సాగుతుంటే తాను కాంగ్రస్‌ను వీడుతున్నట్టు తమ పార్టీలోని ఓ వరగ్గం నేతలు తనని బైటకు సాగనంపే ప్రయత్నం చేస్తున్నట్టు ఉందని మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
తెరాసలో చేరేందుకు సిద్ధమైనట్లు వస్తున్న కథనాలపై ఆయన తీవ్రస్వరంతో స్పందిస్తూ….
సమయం వచ్చినప్పుడు ఏం జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుందన్నారు.పార్టీలు మారడం.
మారకపోవడం తనకు ముఖ్యం కాదన్నారు.అధికారం, పదవుల కోసం తాను ఏనాడు ఆశపడలేదన్నారు.
తనపై నమ్మకం ఉంచి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ది కోసం పనిచేయాల్సిన బాధ్యత తనదని అన్నారు.ఈ క్రమంలోనే నియోజకవర్గంలో అభివృద్ది పనులకు నిధులు మంజూరువిషయమై ఇప్పటికే రాష్ట్ర మంత్రి హరీష్‌రావుతో భేటీ జరిగిందన్నారు.
దీన్ని సాకుగా చూపి, తను పార్టీ మారుతున్నట్టు సొంత పార్టీలోని వారే మీడియాకు కథలు అల్లి మరీ ఇస్తున్నారని, ఈ క్రమంలోనే తనకు తెలంగాణ పార్టీ షోకాజ్ ఇచ్చి ఉంటుందని అన్నారాయన.నేను ఏం చేసినా, ప్రజలకు తెలిసేలా, వారితో చర్చించి చేస్తా, వారేం కోరుకుంటే అదే చేస్తానంటూ కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సంచలనానికి నాంది పలికేలా ఉన్నాయని విశ్లేషకుల భావన.
మరి ఇప్పటికే కోమటి రెడ్డి వ్యవహారంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.