తెలుగుదేశం జనసేన పొత్తు( TDP Janasena Alliance ) అధికారికం కావడంతో ఇక రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందని, వైసీపీని గద్దె దించే దిశగా ఈ ఇరు పార్టీలు కలసి బలంగా ముందుకు వస్తాయని అనేక రాజకీయ విశ్లేషణలు వినిపించాయి.ఎందుకంటే గడిచిన ఎన్నికలలో యాబై కు పైగా స్థానాలలో కేవలం వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసిపికి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని రెండు పార్టీలు పొత్తులో అత్యధిక శాతం విజయాలను నమోదు చేసి ఏకపక్షంగా అధికారాన్ని చేజిక్కించుకుంటాయంటూ మెజారిటీ తెలుగు మీడియా విశ్లేషణ చేసింది.
అయితే పొత్తు స్ఫూర్తికి ప్రధాన ఇరుసు అయిన ఇరు పార్టీల కార్యకర్తల కలయిక మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదా? అంటే ఔననే సమాదనం వస్తుంది .ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తాము ద్వితీయ శ్రేణి కార్యకర్తలుగా పరిగణించబడుతున్నామన్న భావన జనసైనికులలో( Janasena ) రగులుతుంటే తమ కంచుకోట లాంటి స్థానాలను వీరికి ఎందుకు త్యాగం చేయాలన్న భావన మెజారిటీ తెలుగుదేశం నాయకుల్లో( TDP Leaders ) కార్యకర్తల్లో కలుగుతున్న వాతావరణం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీగా ఈ రెండు పార్టీల పొత్తుకు కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నప్పటికీ స్వతహాగా కూడా ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య అంతసహృద్భావ వాతావరణం కూడా కనిపించడం లేదన్నది రాజకీయ పరిశీలకుల మాట.చంద్రబాబు అరెస్టుపై( Chandrababu Arrest ) జన సైనికులలో కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తుంటే తమను జెండా కూలీలుగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు హేలన చేస్తున్నారంటూ కొందరు హార్డ్ కోర్ జనసైనికులు కూడా పోస్టులు పెడుతున్నారు.
ఏది ఏమైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము కలసి నడుస్తున్నామని ప్రకటించిన ఇరు పార్టీల అధినేతలు తమ కార్యకర్తల మధ్య సమన్వయాన్ని మాత్రం అంత సంతృప్తికర స్థాయిలో చేయలేకపోయారు అన్నది మాత్రం వాస్తవం.దాని ఫలితం ఇప్పుడు కార్చిచ్చులా రగులుతుంది .ఇది దావాలనం లా మారి పొత్తు ధర్మానికి తూట్లు పోడవకముందే ఇరు పార్టీల అగ్రనేతలు కలగజేసుకొని కార్యకర్తల మధ్య సమతుల్యత తీసుకురాకపోతే పొత్తు ఘోరంగా విఫలమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.