బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, గుడిహత్నూర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వరద ముంపుకి గురైన వారి ఇండ్లకు వేళ్లి అక్కడ నేలకోన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాపురావు గారు. ఉదయం ఫోన్ ల ద్వారా బిజెపి మండల అధ్యక్షులు అందరికీ ఫోన్ల ద్వారా తమ తమ మండలాలలో గత మూడు నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి తెలుసుకుంటున్న సందర్భంలో ఇచ్చోడ గుడిహత్నూర్ మండలంలోని జనావాస లోనికి నీరు ప్రవేశించిందని.
ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ గారు గుడిహత్నూర్ జడ్ పి టి సి బ్రహ్మానంద్ గారు తెలపడంతో సోయం బాపురావు గారు వరద ముంపుకి గురైన ప్రాంతాలలో ప్రజలను కలుస్తూ వారి యొక్క పరిస్థితులను తెలుసుకున్న ఎంపీ సోయం.తక్షణమే వారికి సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను కోరారు అనంతరం ముంపుకు గురైన వారికి భరోసా ఇచ్చారు.ఏలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఈ విపత్కర సమయంలో ప్రతి బిజేపీ కార్యకర్త సహయంలో ముందుండాలని ఎంపీ సోయం అన్నారు.
ముఖ్యగమనిక
వరద ప్రభావిత ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు ఎవరు వేల్లవద్దని కరెంటు స్తంబాలని ఎవరు తాకవద్దని గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ సోయం బాపురావ్ గారు సూచించారు.
సహాయక చర్యల కోసం గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్
ఆదిలాబాద్ కంట్రోల్ రూం నంబర్ 18004254939
.