ప్రభాస్ హీరోగా మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇక్కడ మంచి విజయాలను అందుకున్నారు…ఆ తర్వాత బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు…ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా గా వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి… ప్రభాస్‌ను నాగ్ అశ్విన్ ఎలా చూపిస్తారో? అంటూ గత కొన్ని నెలలుగా ఫ్యాన్స్ ఎదురు చూసారు అయితే ఫస్ట్ లుక్‌తో కాస్త నిరాశపరిచినా.గ్లింప్స్‌తో వావ్ అనిపించారు.
సినిమాకు కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) అని పేరు కూడా పెట్టేసారు.దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అనే లెక్కలు ఓ వైపు ఫ్యాన్స్ వేసుకుంటుంటే… ప్రభాస్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరో రకమైన చర్చకు దారి తీశాయి.అదే కమెడియన్ కామెంట్స్…
ప్రాజెక్ట్ కే( Project K ) అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా రూపొందుతున్న సినిమాకు పేరు పెట్టడానికి కామికాన్‌కు వెళ్లింది టీమ్.అక్కడ ఘనంగా అనౌన్స్ చేశారు కూడా.సినిమాపై ఉన్న అంచనాలను ఈ గ్లింప్స్ తారస్థాయికి తీసుకెళ్లింది అని చెప్పాలి.హిందూ మైథాలజీని ఈ సినిమాలో మెయిన్ థీమ్‌గా తీసుకున్నారని అర్థమవుతోంది.మైథాలజీకి సైన్స్, ఫిక్షన్ కలిపి ఈ సినిమా తీస్తున్నారు.మైతాలజీ ప్రకారం.
కలియుగాంతంలో కల్కి అవతారంలో విష్ణుమూర్తి మళ్లీ వస్తారని ఉంది.ఇదే లైన్ తో నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) కల్కి 2898 ఏడీ సినిమాని రూపొందిస్తున్నారు….
సినిమాలో కల్కి అవతారంలో ప్రభాస్ కనిపించనున్నాడు.సినిమాలో ఈ కల్కి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది అని అందరూ అనుకుంటుంటే…సినిమాలో తన పాత్ర కామెడీగా ఉంటుందని, సినిమాలో నేనే కమేడియన్‌ని అని ప్రభాస్ అన్నాడు.దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కల్కి పాత్ర( Kalki Role ) కామెడీగా ఉండడమేంటి? ప్రపంచం మొత్తాన్ని కాపాడే యోధుడి పాత్ర కామెడీగా ఉంటే ఎలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి….
అయితే ప్రభాస్( Prabhas ) నిజంగానే కామెడీగా ఉంటుందని చెప్పాడా? లేక సరదాగా అన్నాడా? అనేది తెలియాల్సి ఉంది.వైజయంతి మూవీస్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది.ప్రభాస్‌కి జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా… అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు…
ఇక ఈ సినిమా మీద ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు…అలాగే నాగ్ అశ్విన్ ఈ సినిమా చివర్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇస్తున్నాడు అని తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవులు గా ఉన్న హనుమంతుడు అశ్వద్ధామ లాంటి కొన్ని క్యారెక్టర్స్ కల్కి కి హెల్ప్ చేస్తారు దానికోసం చివర్లో హనుమంతుడి పాత్ర లో వచ్చి ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో రామ్ చరణ్( Ram Charan ) నటిస్తున్నాడు అని తెలుస్తుంది…ఇది ట్రైలర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటూ ఒక న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.చూడాలి మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో…