ఏపీలోని దొంగల బండారాన్ని సీబీఐ బయటపెట్టిందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.సీఎం జగన్ మౌనం వీడకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
షర్మిల, సునీతా రెడ్డి వాంగ్మూలాలతో పాటు సీబీఐ తేల్చిన విషయాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసినా జగన్ స్పందించరా అని నిలదీశారు.ఛార్జిషీట్ లోని అంశాలపై జగన్ మౌనం అర్థాంగీకారమనుకోవాలా అని ప్రశ్నించారు.సునీతా రెడ్డి, షర్మిల వాంగ్మూలంపై జగన్ ఏం సమాధానం చెబుతారన్న బోండా ఉమ పిటిషన్లు వెనక్కి తీసుకుంటే రూ.500 కోట్లు ఇస్తామని సునీతాకు ఆఫర్ ఇచ్చింది నిజమా.? కాదా .? అని ప్రశ్నించారు.