ఫైనల్ గా పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దేవరకొండ

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సీనియర్ డైరక్టర్ పూరి జగన్నాథ్ మరో క్రేజి హీరోను కూడా పట్టేశాడు.విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ సినిమా చేబయితున్నాడని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

 Purivijay Deverakonda Filmis Nowofficial-TeluguStop.com

అయితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు లైన్ ప్రొడ్యూసర్ ఛార్మి అధికారికంగా తెలిపింది.

ఫైనల్ గా పూరికి గ్రీన్ సిగ్నల

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ లోనే దర్శకుడు అలాగే ఛార్మి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని ఛార్మి ఒక స్పెషల్ నోట్ ద్వారా తెలియజేశారు.అయితే గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ కథకు సీక్వెల్ చేస్తారా లేక మరో కొత్త కథను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.

అలాగే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జనగణమన అనే ఒక డిఫరెంట్ సోషల్ మెస్సేజ్ ఉన్న సినిమాను చేస్తానని చెప్పిన పూరి ఇప్పుడు ఆ కథను దేవరకొండకు డైవర్ట్ చేశాడు అనే టాక్ కూడా వస్తోంది.ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube