భారత్ లో ఇంకా పూర్తిగా బ్యాన్ చేయని పబ్ జీ... యధేచ్చగా ఆడేస్తున్న యువత...!

ఐదు రోజుల క్రితం భారతదేశ ప్రభుత్వం మరోసారి చైనా దేశానికి చెందిన యాప్ లపై సంబంధించి ఉక్కు పాదం మోపిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందుకు సంబంధించి మరో సారి చైనా దేశానికి చెందిన 118 యాప్ లను భారతదేశ ప్రభుత్వం దేశంలో బ్యాన్ చేసింది.

 Pubg Mobile Still Working Days After It Ministry Banned The Game In India, China-TeluguStop.com

ఇక ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన పబ్ జి గేమ్ కూడా ఉంది.భారతదేశ ప్రభుత్వం నిషేధించిన కారణంగా అటు గూగుల్ ప్లే స్టోర్, ఇటు ఆపిల్ ప్లే స్టోర్ లో నుండి పబ్ జి గేమ్ ను తొలగించడం జరిగింది.

ఇంత వరకు బాగానే ఉన్నా.ఇందుకు సంబంధించి ఇంకా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎటువంటి బ్లాక్ చేయలేదు.దీంతో ఇప్పటి వరకు ఆల్రెడీ పబ్ జి గేమ్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారో వారందరికీ యధాతధంగానే గేమ్ ను ఆస్వాదిస్తున్నారు.అయితే వీటిని ప్లే స్టోర్స్ నుండి తొలగించడంతో కొత్తగా ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకునే వారు లేకుండా పోయారు.

అయితే ఇది వరకు వారి ఫోన్ లలో గేమ్ ను ఇన్స్టాల్ చేసుకుని ఆడుతున్న వారు ఆ విధంగానే ఆటను కొనసాగిస్తున్నారు.భారతదేశం ఈ గేమ్ కు సంబంధించి సర్వర్లను ఇంకా షట్ డౌన్ చేయకపోవడంతో ఈ ఆట ఇంకా కొనసాగుతూనే ఉంది.

భారతదేశంలో పూర్తిగా ఈ ఆటను నిలిపేయాలంటే అందుకు సర్వీస్ ప్రొవైడర్లు పూర్తిగా నిలిపి వేయడంతో పాటు, సర్వర్లను నిలుపుదల చేస్తేనే పూర్తిగా ఆడలేరు.ఇకపోతే బ్యాన్ సందర్భంగా భారతదేశంలో పబ్ జి ఆడే వ్యక్తులు కూడా తగ్గారు.


ప్రస్తుతం ఆటలో ఎక్కువమంది ఆడకపోవడంతో ఆట చాలా సులువు గా ఉందని కొందరు తెలియజేస్తున్నారు.ఇకపోతే పబ్ జి గేమ్ కి సంబంధించి టెన్ సెంట్ గేమ్స్ భారతదేశ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ భారతదేశంలో పబ్ జి ఆట వస్తుందో రాదో అర్థం అవ్వట్లేదు.

అయితే కేవలం ఈ గేమ్ కు చెందిన కంప్యూటర్, కన్సోల్ వర్షన్లను బ్యాన్ చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు అర్థమవుతోంది.దీంతో మొబైల్ ఆటగాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ ఫ్లాట్ఫామ్ లపై ఆటను ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube