కరోనా విషయంలో ప్రియాంక చోప్రా జాగ్రత్తలు..!!

దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ విధించడం జరిగింది.

 Priyanka Chopra Cautioned About Corona Priyanka Chopra, Corona, Bollywood ,mask-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్ర లో సెకండ్ వేవ్ తీవ్రత ను ఉద్దేశించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు ఇవ్వడం జరిగింది.ఇంటి నుండి అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాలని తెలిపింది.

కరోనా తగ్గిపోయింది అన్న రీతిలో గత రెండు నెలలుగా ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించలేదని అందువల్లే ప్రస్తుతం వైరస్ విచ్చలవిడిగా విజృంభిస్తుంది అని పేర్కొంది.దేశంలో ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి చూస్తే చేయి దాటి పోయినట్టు అనిపిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం బంధువుల కోసం అదేవిధంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.ఇలాంటి క్లిష్ట సమయంలో చుట్టుపక్కల వారికి సాయం చేయాలని ప్రియాంక చోప్రా తెలిపింది.

అదేవిధంగా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి అని కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube