దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి( NDA alliance )అధికారంలోకి రావడం తెలిసిందే.దీంతో జూన్ 9వ తారీఖు నాడు ఆదివారం మూడోసారి భారత్ ప్రధానిగా నరేంద్ర మోదీ ( Prime Minister Modi )ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.
రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలనుండి నాయకులు ప్రముఖులు రావటం జరిగింది.కేంద్ర క్యాబినెట్ లో ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురికి చోటు దక్కింది.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా హాజరయ్యారు.
సార్క్ సభ్య దేశాల ప్రతినిధులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశంలో నుండి పలువురు రాజకీయ సినీ వ్యాపార దిగ్గజాలు తరలివచ్చారు.విదేశాల నుండి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సిషేల్స్ నేతలు సహా దాదాపు ఎనిమిది వేల మందికి పైగా ప్రత్యేక అతిధులు హాజరయ్యారు.ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు.
సుప్రీంకోర్టు సిజే జస్టిస్ డివై చంద్రచూడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ( Mukesh Ambani ), సినీ నటులు షారుఖ్ ఖాన్, రజనీకాంత్ తోపాటు ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు.రాష్ట్రపతి భవన్ చుట్టూ మూడెంచుల భద్రత ఏర్పాటు చేశారు.