రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అంతకుముందు అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.బయోమెట్రిక్ విధానం లో అభ్యర్థుల వివరాలు నమోదు చేసి, తరువాత లోపలికి అనుమతించారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం, సిరిసిల్లలోని జడ్పీ ఉన్నత పాఠశాల గీతా నగర్, శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వికాస్ డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్, నోడల్ ఆఫీసర్ పూజారి గౌతమి, అలాగే సిరిసిల్లలోని జడ్పీ ఉన్నత పాఠశాల వెంకంపేట్, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శ్రీ కృష్ణ దేవరాయ జూనియర్ కాలేజీ, తెలంగాణ మైనార్టి రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడ లోని పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు.
3780 మంది హాజరు
మొత్తం జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా, మహిళ అభ్యర్థులు 2034, పురుష అభ్యర్థులు 2,663, ట్రాన్స్ జెండర్స్ 2 మొత్తం 4699 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, మహిళ అభ్యర్థులు 1,644, పురుష అభ్యర్థులు 2,135, ట్రాన్స్ జెండర్స్ 1 హాజరు కాగా, మొత్తం 3,780 మంది పరీక్ష రాశారు.పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఇక్కడ ఆర్సీఓ వడ్లూరి శ్రీనివాస్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నాగేంద్రా చారి, పర్యవేక్షకులు వేణు తదితరులు పాల్గొన్నారు.