రేవంత్‌పై ప్ర‌వీణ్‌కుమార్ ఎఫెక్ట్‌.. ఆ మాట‌ల‌కు అర్థం అదేనా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అనూహ్య మార్పులు క‌నిపిస్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా అన్ని పార్టీలు ఇప్పుడు ద‌ళితులు, అలాగే గిరిజ‌నుల మీద ఎక్క‌డా లేని ప్రేమ‌ను చూపిస్తున్నాయి.

 Praveen Kumar Effect On Revanth .do Those Words Mean Anything .praveen Kumar, Re-TeluguStop.com

ఇక మ‌రీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ల‌ను కూడా నిర్వ‌హిస్తూ ఆ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అయితే ఈ స‌భల్లో ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ మాట్లాడ‌ని మాట‌లు చెబుతున్నారు.

ద‌ళితులు, గిరిజ‌నులు చ‌దువుకోవాల‌ని ఆ వ‌ర్గాల్లోని యువత డాక్ట‌ర్లు, ఇంజినీర్లు కావాల‌ని కోరుతున్నారు.

అంతే కాదు వారు రాజ్యాధికారంలో భాగం కావాల‌ని, వారే చ‌ట్టాలు చేయాల‌ని చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ఈ వ్యాఖ్య‌లు గ‌తంలో నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్య‌లను గుర్తు చేస్తున్నాయి.ఆయ‌న రాజ‌కీయాల్లోకి రాక‌ముందు నుంచే ద‌ళిత‌, గిరిజ‌న‌, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు అధికారం రావాలని వారు కూడా చ‌దువుకోవాల‌ని, వారు డాక్ట‌ర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు కావాల‌ని కోరుతున్నారు.

ఇక ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డంతో ఇప్పుడు ఆ వ‌ర్గాలు మొత్తం ప్ర‌వీణ్ కుమార్ వైపు తిరుగుతాయోమే అని భ‌య‌ప‌డిపోతున్నారు.

Telugu Bsp, Congress, Dalithgirijana, Praveen Kumar, Revanth, Tg, Tpcc Revanth-T

ఇక రేవంత్ కూడా అల‌ర్ట్ అయిపోయి ఎలాగైనా ఆ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వారికి చ‌దువు కావాలంటూ చెబుతున్నారు.వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తుంటే ఆర్‌.ఎస్‌.

ప్ర‌వీన్ కుమార్ ఎఫెక్ట్ బాగానే ప‌డిన‌ట్టు అనిపిస్తోంది.మ‌రి రేవంత్ చెబుతున్న మాట‌లు ఆ వ‌ర్గాలను ఎంత‌లా ఆక‌ట్టుకుంటున్నాయో తెలియ‌దు గానీ రాజీకీయ ప‌రంగా కొంత మార్పు వ‌చ్చిన‌ట్టు మాత్రం క‌నిపిస్తోంది.

మొత్తానికి ప్ర‌వీణ్ కుమార్ ఓ ట్రెండ్ అయితే సెట్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది రాజ‌కీయాల్లో.మ‌రి మున్ముందు ఇంకెంత మందిమీద ప్ర‌వీణ్ కుమార్ ఎఫెక్ట్ చూపిస్తారో అనేది మాత్రం వేచి చూడ‌క త‌ప్ప‌దు మ‌రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube