ఈ నెల 29న కడుపుబ్బ న‌వ్వించ‌డానికి 'మిస్ట‌ర్ ప్రేమికుడు' వ‌స్తున్నాడు

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘చార్లీ చాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి.

 Prabhudeva Adhasharma Starring Mister Premikudu Movie Releasing On 29th Of Novem-TeluguStop.com

కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులో కి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సంద‌ర్భంగా ఈరోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ…“మ‌హేష్ చౌద‌రి, వి.శ్రీనివాస‌రావు వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ఎన్నో పెద్ద చిత్రాలు రిలీజ్ చేశారు.త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన చార్లిచాప్లిన్ చిత్రాన్ని`మిస్ట‌ర్ ప్రేమికుడు`గా తెలుగులో అనువ‌దిస్తూ నిర్మాత‌లుగా మారారు.ప్ర‌భుదేవా న‌టించిన ఎన్నో మంచి చిత్రాల్లో ఇదొక‌టి.మొద‌ట్లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాలా మంది ప్ర‌య‌త్నించారు.ఎందుకంటే తెలుగు నేటివిటీకి స‌రిగ్గా స‌రిపోయే సినిమా ఇది.ల‌వ్, క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ, యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటు ఇందులో మంచి పాట‌లు కూడా ఉన్నాయి.ప్ర‌భుదేవా న‌ట‌న‌, నిక్కి గ‌ల్రాని, అదాశ‌ర్మ అందం, అభిన‌యం, శ‌క్తి చిదంబ‌రం డైర‌క్ష‌న్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు.

ఈ నెల 29 వ‌స్తోన్న ఈ చిత్రంతో నిర్మాత‌లకు మంచి లాభాలు వ‌చ్చి మ‌రెన్నో చిత్రాలు నిర్మించాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.

Telugu November, Adhasharma, Prabhudeva, Nikki Galrani, Prasanna Kumar, Gurramma

డిస్ట్రిబ్యూట‌ర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ…“వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి ఇద్ద‌రూ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ఎన్నో మంచి చిత్రాలు రిలీజ్ చేశారు.ఈ సినిమాతో నిర్మాత‌లుగా మారారు.

ఇటీవ‌ల విడుద‌లైన డబ్బింగ్ సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ రాబడుతున్నాయి.ఆ కోవ‌లో ఈ సినిమా కూడా విజ‌యం సాధించి నిర్మాత‌లు మంచి పేరు, లాభాలు తీసుకురావాల‌న్నారు.

నిర్మాత గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ.“ ఎక్కడా రాజీ ప‌డ‌కుండా తెలుగు స్ట్ర‌యిట్ సినిమాలా డ‌బ్బింగ్ చేయించాము.పాట‌లు కూడా బాగొచ్చాయి.త‌మిళంతో ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయింది.తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుంన‌ద్న న‌మ్మ‌కం ఉంది.ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైన మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్న‌“ అన్నారు.

Telugu November, Adhasharma, Prabhudeva, Nikki Galrani, Prasanna Kumar, Gurramma

వి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ…“ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి.ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు హైలెట్.చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ ని మ‌రోసారి తెరపై క‌నువిందు చేయ‌బోతుంది.

ఈ నెల 29న గ్రాండ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం“ అన్నారు.

Telugu November, Adhasharma, Prabhudeva, Nikki Galrani, Prasanna Kumar, Gurramma

`బాక్సాఫీస్ `అధినేత ర‌మేష్ చందు మాట్లాడుతూ…`మ‌హేష్ చౌద‌రి గారు, శ్రీనివాస గారు చాలా కాలంగా ప‌రిచ‌యం.ఇద్ద‌రూ ఎంతో ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తులు.ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చాలా రిచ్ గా చేశారు.త‌మిళంలో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ గోపాల్ మాట్లాడుతూ…“మ‌హేష్ చౌద‌రి, శ్రీనివాస్ ఇద్ద‌రితో మంచి ప‌రిచ‌యం ఉంది.ఒక మంచి సినిమాను తెలుగులోకి అనువదించారు.

డిస్ట్రిబ్యూట‌ర్స్ గా స‌క్సెస్ అయ్యారు.నిర్మాత‌లుగా కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube